ఓ ఆశ్రమం ... అనేక అనుమానాలు ! అసలు అక్కడ ఏం జరుగుతోంది ..?     2018-06-16   04:01:40  IST  Bhanu C

అది ఓ ఆధ్యాత్మిక ఆశ్రమం ! కానీ ప్రజలు ఎవరికీ ఎంట్రీ లేదు. అసలు అక్కడ ఓ ఆశ్రమం ఉన్నట్టే ఎవరికీ తెలియదు. కానీ ఆ ఆశ్రమం గురించి ఉత్తరాది నాయకులు అందరికీ బాగా తెలుసు అందుకే కేవలం వీవీఐపీలు మాత్రమే అక్కడకు వస్తూ ఉంటారు . ఉత్తరాదికి చెందిన రాజకీయ ప్రముఖులు కూడా వస్తుంటారు. అయితే ఇక్కడకి ఎవరు వచ్చినా అంతా సీక్రెట్ గానే వస్తుంటారు తప్ప ఎక్కడా ఫోకస్ అవ్వడానికి మాత్రం ఇష్టపడరు. దాని గురించిన అనేక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.

తిరుపతి దగ్గరున్న రామాపురంలో ఒక ఆశ్రమానికి సంబందించిన రహస్యాలు వెలుగులోకి తెచ్చింది ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్. కేవలం విఐపిలు మాత్రమే ఇక్కడకి రావడం ఈ ఆశ్రమం గురించి ఎవరికి తెలియకపోవటానికి ముఖ్య కారణమేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాళ్ల గుట్టల్ల మధ్య ఆశ్రమం ఒక్కటేనా లేక ఇంకేదయినా రహస్యం ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శ్రీ సిద్దేశ్వర్ తీర్థ్ బ్రహ్మర్షి ఆశ్రమంలో స్వామి గురువానంద కొంత మందిని మాత్రమే కలుస్తారు, అదికూడా రహస్యంగా. సుందరమైన పాలరాతి ఆలయం, చక్కటి అతిధి గృహాలు ఉన్న ఆశ్రమ ప్రాంగణంలోకి స్థానికులకు ప్రవేశం లేదు అని ఆ కెనాల్ తన కథనంలో పేర్కొంది.