బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ మరోసారి తెలంగాణకు రానున్నారు.మూడు రోజుల కిందటే రాష్ట్రానికి వచ్చిన ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇవాళ్టి పర్యటనలో భాగంగా రెండు బహిరంగ సభలతో పాటు రోడ్ షోలో అమిత్ షా పాల్గొననున్నారు.షెడ్యూల్ ప్రకారం ముందుగా మధ్యాహ్నం 12.35 గంటలకు అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.అక్కడ నుంచి జనగామకు వెళ్లనున్న ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు.మధ్యాహ్నం 2.45 గంటలకు కోరుట్లకు వెళ్లనున్న అమిత్ షా మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.40 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.ఆ తరువాత బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఉప్పల్ వరకు అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు.కాగా ఈ రోడ్ షో సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది.రోడ్ షో ముగిసిన అనంతరం రాత్రి 8.10 గంటల సమయంలో ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఎన్నికల ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది.