అమిత్‌ షా కరోనా నెగటివ్‌పై నిజం కాదు  

Fake news on Amit Shah Tested Negative,Amit Shah ,COVID, Union home minister Amit Shah\'s health condition - Telugu Amit Shah, Amit Shah Health, Covid, Fake News On Amit Shah Tested Negative, Union Home Minister Amit Shah\\'s Health Condition, అమిత్ షా, కరోనా

కరోనా సోకిన వారు కనీసం పది రోజుల నుండి రెండు వారాల వరకు ఇబ్బంది పడాల్సి వస్తుంది.కాని కొందరు మాత్రం వారం రోజుల లోపే కరోనాను జయిస్తున్నారు.

 Amit Shah Tested Negative Fake News

కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రముఖులు ఎక్కువ శాతం త్వరగా కోలుకుంటున్నారు.ఐశ్వర్య రాయ్‌ మరియు ఆరాధ్యలు కేవలం పది రోజుల్లోనే కరోనాను జయించారు.

అమితాబచ్చన్‌ దాదాపుగా మూడు వారాల తర్వాత కరోనాను జయించారు.ఇప్పుడు అమిత్‌ షా కేవలం వారం రోజుల్లోనే కరోనాను జయించారు అంటూ మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.

అమిత్‌ షా కరోనా నెగటివ్‌పై నిజం కాదు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఈ వార్తలను కేంద్ర హోం శాఖ కొట్టి పారేసింది.ఇప్పటి వరకు ఆయన కరోనా నెగటివ్‌ రాలేదని పేర్కొన్నారు.

గత వారంలో అమిత్‌ షా కు కరోనా నిర్థారణ అయ్యింది.స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న తాను కరోనా నిర్థారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చిందని నాతో గత వారం రోజులుగా కాంటాక్ట్‌ అయిన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండటంతో పాటు పరీక్షలు చేయించుకోవాలంటూ అమిత్‌ షా సూచించాడు.

పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయినప్పటి నుండి గుర్‌గ్రామ్‌ లోని మేదాంత ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమిత్‌ షా ఇంకా అక్కడే ఉన్నారు.ఆయన కరోనాను జయించి డిశ్చార్జ్‌ అయ్యారంటూ వస్తున్న వార్తలు నిజం కాదని తేలిపోయింది.

దాంతో ఆయన అభిమానులు త్వరగా కరోనాను జయించి అమిత్‌ షా రావాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

#COvid #Amit Shah #UnionHome #కరోనా #FakeNews

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amit Shah Tested Negative Fake News Related Telugu News,Photos/Pics,Images..