మీడియా కోసం అమిత్ షా ఆరాటం ! ఈనాడు, టీవీ 9 అధిపతులతో భేటీ..?

దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో నష్ట నివారణ చర్యలకు బీజేపీ దిగింది.ముఖ్యంగా మీడియాలో తమ పార్టీ గురించి అనుకూల కథనాలు రాకపోయినా .

 Amit Shah Meeting With Ramoji Rao And Srini Raju-TeluguStop.com

వ్యతిరేక కథనాలు ప్రచారం కాకుండా చూసుకునేందుకు పావులు కదుపుతోంది.ఈ నేపథ్యంలోనే తెలంగాణలో త్వరలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా పర్యటించబోతున్నారు.

రెండు రోజుల పర్యటనలో ఆయన బీజేపీ నేతలను కలుసుకుంటారు.సందట్లో సడేమియా అన్నట్టు కొంతమంది మీడియా అధిపతులతో కూడా భేటీ అయ్యి స్వామి కార్యం సకార్యం రెండూ చక్కబెట్టుకోవాలని అమితాషా చూస్తున్నాడు.

కొద్దీ రోజులుగా .దేశంలోని ప్రముఖులను కలుసుకుని వారికి ఈ నాలుగేళ్లలో సాధించిన విజయాలను వివరిస్తున్నారు బీజేపీ అగ్ర నాయకులు.మోడీ పాలన విజయాలపై నెల రోజులుగా బీజేపీ ప్రచారం చేస్తోంది.“సంపర్క్ సే సమర్ధన్” అంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది.ఇప్పటికే మాధురిదీక్షిత్‌, రతన్‌టాటా, కపిల్‌దేవ్‌, రాందేవ్ బాబాతో పాటు పలువురు ప్రముఖులకు అమిత్ షా బుక్‌లెట్ అందజేశారు.ప్రస్తుతం తెలంగాణ టూర్‌లో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును, టీవీ 9 గ్రూప్ ఛైర్మన్ శ్రీనిరాజుతో పాటు బాడ్మింటిన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను అమిత్ షా కలుసుకోబోతున్నారు.

రామోజీరావు, శ్రీనిరాజును అమిత్ షా కలుసుకోవాలనుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచుతోంది.టీడీపీ అనుకూల పత్రికగా ముద్రపడ్డ ఈనాడు గత కొంతకాలంగా బీజేపీ తీరుపై విరుచుకుపడుతోంది.

అంతకుముందు ప్రధానమంత్రి మోడీకి విస్తృత కవరేజీ ఇచ్చే ఈ పత్రిక, చానల్.టీడీపీతో సంబంధాలు చెడిపోయినప్పటి నుంచి బీజేపీ వ్యతిరేక కథనాలు వండి వారుస్తోంది.

అలాగే.శ్రీనిరాజు ఆధ్వర్యంలోని టీవీ 9 కూడా బీజేపీ వ్యతిరేక చానల్‌గా ముద్రపడింది.

ప్రస్తుతం ఈ ఇద్దరు మీడియా యజమానులను కలవడం ద్వారా ఏపీ, తెలంగాణలో బలం పెంచుకోవచ్చని బీజేపీ ఎత్తుగడ.అయితే ఆ ఎత్తుగడలు ఫలిస్తాయా .? బీజేపీ కి ఆ రెండు మీడియా సంస్థలు సహకరిస్తాయా అనేది పెద్ద అనుమానమే.ఎందుకంటే బాబు చెప్పిందే వేదం అన్నట్టు ఉండే ఆ రెండు మీడియా సంస్థలు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తాయని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందేమో !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube