కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణకు రానున్నారు.ఈ మేరకు ఈనెల 28వ తేదీన పర్యటన నిమిత్తం ఆయన రాష్ట్రానికి రానున్నారని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు.
ఇందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పార్టీ ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారని కిషన్ రెడ్డి వెల్లడిచారు.
అదే రోజు తెలంగాణ బీజేపీ శాసన సభాపక్ష నేతలను కూడా నిర్ణయిస్తామని వెల్లడించారు.