అమెరికాలో భారత సంతతి జడ్జి చేతికి గూగుల్ కేసు: తీర్పుపై ఆసక్తి  

Meet Amit Mehta, the Indian-American judge presiding over Google\'s antitrust case, Amit Mehta, Indian-American judge, Google\'s Antitrust Case, Internet Search, Search Channels, America Deputy Attorney Journal Jeff Roshen - Telugu America Deputy Attorney Journal Jeff Roshen, Amit Mehta, Google\\'s Antitrust Case, Indian-american Judge, Internet Search, Meet Amit Mehta, Search Channels, The Indian-american Judge Presiding Over Google\\'s Antitrust Case

అమెరికాలో భారత సంతతికి చెందిన న్యాయ కోవిదుడి సత్తాకి పరీక్ష పెట్టే కేసు ఒకటి ఎదురైంది.దాదాపు రెండు దశాబ్ధాలుగా నలుగుతున్న ప్రముఖ సెర్చింజిన్, టెక్ దిగ్గజం గూగుల్ కేసు విచారణను అక్కడి ప్రభుత్వం భారత సంతతికి చెందిన న్యాయమూర్తి అమిత్ మెహతాకు అప్పగించింది.

TeluguStop.com - Amit Mehta Indian American Judge Googles Antitrust Case Internet Search

నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్నెట్‌ సెర్చ్‌, ఆన్‌లైన్‌ అడ్వర్టయిజింగ్‌లో గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తోందంటూ అమెరికా ప్రభుత్వం గూగుల్ సంస్థపై ఫిర్యాదు చేసింది. అమెరికా ప్రభుత్వం ఒక టెక్ దిగ్గజ సంస్థపై చేసిన అతి పెద్ద ఆరోపణగా ఈ కేసును పరిగణిస్తారు.

అమెరికా ప్రభుత్వ న్యాయ విభాగంతో పాటు 11 రాష్ట్రాలు గూగుల్‌పై ఈ ఆరోపణలు చేశాయి.దీనిలో భాగంగా కొలంబియా జిల్లా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి.

TeluguStop.com - అమెరికాలో భారత సంతతి జడ్జి చేతికి గూగుల్ కేసు: తీర్పుపై ఆసక్తి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మొబైళ్లు, కంప్యూటర్లు, ఇతర గాడ్జెట్లలో గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ను డీఫాల్ట్‌గా ఇన్‌స్టాల్‌ చేసినందుకు పలు సంస్థలకు గూగుల్‌ ఏటా బిలియన్ల డాలర్లను చెల్లిస్తోందని ఈ ఫిర్యాదులో ఆరోపించారు.

పలు సంస్థలతో గూగుల్ చేసుకున్న ఒప్పందాల కారణంగా ఇంటర్నెట్‌కు గూగుల్‌ కాపలాదారుగా మారిందని ఆరోపించారు.

సెర్చ్‌ చానెల్స్‌లో 80 శాతాన్ని గూగుల్ నియంత్రిస్తోందని ఈ ఆరోపణల్లో పేర్కొన్నారు.గతంలో యూరోపియన్‌ యూనియన్‌ నుంచి కూడా గూగుల్‌పై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి.దీనిపై ఈయూ 8.2 బిలియన్ యూరోల జరిమానా విధించింది.అయితే, పోటీ సంస్థలకు హానికరమైన అనుచిత విధానాలతో గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేసింది అని అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్‍ జెఫ్‍ రోసెన్‍ తెలిపారు.టెక్నాలజీ పరిశ్రమలో ఇలాంటి కేసులను సత్వరం పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

అమిత్ మెహతా గుజరాత్ రాష్ట్రంలోని పటాన్‌లో జన్మించారు.జార్జిటౌన్ యూనివర్సిటీ నుంచి రాజనీతీ శాస్త్రం, ఆర్ధిక శాస్త్రాలలో బీఏ పూర్తి చేశారు.

అనంతరం 1997లో వర్జీనియా స్కూల్ ఆఫ్ లా నుంచి డాక్టరేట్ పొందారు.అనంతరం ఓ న్యాయ సలహా సంస్థలో కొంతకాలం పనిచేశారు.

ఆ తర్వాత కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా 2002 నుంచి విధులు నిర్వహించారు. 2014లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా.

అమిత్‌ను కొలంబియా జిల్లా జడ్జిగా నియమించగా, 2015లో పదవి బాధ్యతలు స్వీకరించారు.న్యాయమూర్తిగా ఆయన పలు కీలక తీర్పులు వెలువరించారు.

#Search Channels #Meet Amit Mehta #Internet Search #AmericaDeputy #Amit Mehta

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amit Mehta Indian American Judge Googles Antitrust Case Internet Search Related Telugu News,Photos/Pics,Images..