లాల్ సింగ్ చద్దా గా అమీర్ లుక్స్ సూపర్

ఒకప్పుడు హీరో అనగానే హీరోయిజం చూపించి కాస్త రెండు ఫైట్స్ చేశామా,ఒక స్టెప్ వేశామా అన్నట్లుగా ఉండేవారు.కానీ ఈ తరం నటులు మాత్రం అలా కాదు నటన తో పాటు ఎక్స్ ట్రా టాలెంట్ తో కూడా అలరిస్తున్నారు.

 Amirkhan Lalsingh Chadda First Look Released-TeluguStop.com

మరి ముఖ్యంగా ప్రయోగాలు చేయడం లో ముందు ఉంటున్నారు.అలా బాలీవుడ్ లో ప్రయోగాలు చేసే హీరోల్లో అమీర్ ఖాన్ కూడా ఒకరు అని చెప్పాలి.

ఆయన చేసిన దంగల్ చిత్రం గానీ ఇలా చూసుకుంటూ పొతే ఎదో ఒక ప్రయోగం తో అలరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అమీర్.అయితే ఈ హీరో ప్రస్తుతం హాలీవుడ్ రీమేక్ లో నటిస్తున్న విషయం విదితమే.

హాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టిన ఫారెస్ట్ గంఫ్ చిత్రం ను లాల్ సింగ్ చద్దాగా రీమేక్ చేస్తుండగా,ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది.అయితే ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా, ఆ పోస్టర్ లో అమీర్ ను చూస్తే మాత్రం చాలా డీసెంట్,అమాయకుడిగా కనిపిస్తున్నాడు.

అయితే ఈ చిత్రంలో హీరో చాలా అమాయకుడిగా కనిపిస్తూ రన్నింగ్ చేస్తూ ఉంటాడట.

Telugu Amirkhan, Hollywood-

అయితే పాత్రకు తగ్గట్లుగా అమీర్ తన లుక్స్ ని మార్చుకోవడం విశేషం.ఈ చిత్రం హాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకోగా ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలని అమీర్ భావించాడు.ఈ క్రమంలోనే తన లుక్స్ ను కూడా మార్చుకొని ఈ చిత్ర ఫస్ట్ లుక్ లో కనిపించాడు.

లాల్ సింగ్ చద్దాగా అమీర్ లుక్ సింప్లి సూపర్ అని, అమీర్ లుక్స్ ను చూసి అందరూ ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube