అమీర్ ఖాన్ కొడుకు ఫస్ట్ మూవీ షూటింగ్ స్టార్ట్

బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇండియన్ బిగ్ స్క్రీన్ పై టాలెంటెడ్ యాక్టర్స్ పేర్లు చెప్పుకుంటూ కచ్చితంగా అమీర్ ఖాన్ పేరు ముందు వరుసలో ఉంటుంది.

 Amir Khan Son Movie Shooting Started-TeluguStop.com

పాత్ర పెర్ఫెక్షన్ కోసం తనని తాను ఎలా అయినా మార్చేసుకోవడానికి అమీర్ ఖాన్ రెడీగా ఉంటారు.దంగల్ మూవీలో రెండు భిన్నమైన షేడ్స్ లో కనిపించే అమీర్ ని చూస్తే పర్ఫెక్షన్ కోసం అతను ఎంత కష్టపడతాడో అర్ధమవుతుంది.

ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ తనయుడు జూనైద్ ఖాన్ ఇప్పుడు హీరోగా బాలీవుడ్ లో తెరంగేట్రం చేయడానికి రెడీ అయ్యాడు.అతని మొదటి సినిమా సిద్దార్ద్ పి మలోత్రా దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

 Amir Khan Son Movie Shooting Started-అమీర్ ఖాన్ కొడుకు ఫస్ట్ మూవీ షూటింగ్ స్టార్ట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మహారాజ్ అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కబోతుంది.

ఇదిలా లాక్ డౌన్ కి ముందే ఈ సినిమాని ఎనౌన్స్ చేసి స్టార్ట్ చేయాలని అనుకున్నారు అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది.

ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం షూటింగ్ లకి పర్మిషన్ ఇచ్చింది.

Telugu Amir Khan, Amir Khan Son, Amir Khan Son Movie, Bollywood, Corona Second Wave, Director Siddharth P Malhotra, Heroine Shalini Pandey, Junaid Khan, Maharaja Movie, Shooting Started, Siddharth Malhotra, Tollywood-Movie

కరోనా నిబంధనలకి లోబడి షూటింగ్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు షూట్ లో పాల్గొనే అందరూ కరోనా వాక్సిన్ కచ్చితంగా వేసుకోవాలని రూల్ పెట్టింది.ఇక ఈ నిబంధనలకి లోబడి తాజాగా అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ మొదటి చిత్రం షూటింగ్ ప్రారంభమైంది.లాక్ డౌన్ తర్వాత సెట్స్ పైకి వెళ్ళిన మొదటి హిందీ చిత్రం మహారాజ్ కావడం విశేషం.

ఇదిలా ఉంటే ఈ మూవీలో టాలీవుడ్ బ్యూటీ అర్జున్ రెడ్డి ఫేం షాలినీ పాండే కీలక పాత్రలో నటిస్తుంది.అయితే ఆమె హీరోయిన్ గా చేస్తుందా లేదంటే వేరొక పాత్రలో కనిపించాబోతుందా అనేది తెలియాల్సి ఉంది.

#HeroineShalini #AmirKhan #Amir Khan Son #Amir Khan #Junaid Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు