బాయ్ ఫ్రెండ్ తో డ్యాన్స్ ఆడిన అమీర్ కూతురు...వీడియో హల్ చల్

తల్లి దండ్రులను చూసే పిల్లలు అన్నీ నేర్చుకుంటారు అని చెబుతారు.కొన్ని కొన్ని విషయాల్లో అది నిజమే అని కూడా అనిపిస్తుంది.

 Amir Khan Daughter Ira Khan Video Goes Viral In Social Media-TeluguStop.com

తల్లి దండ్రులను చూసి నేర్చుకొని పిల్లలు కూడా వారిని ఫాలో అవుతూ ఉంటారు.ఈ విషయంలో సామాన్యుల విషయం పక్కన పెడితే సెలబ్రిటీ ల విషయంలో మాత్రం అచ్చు తల్లి దండ్రులనే ఫాలో అవుతారు అని చెప్పాలి.

దీనికి తాజా నిదర్శనం బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో ను పోస్ట్ చేసింది.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

అమీర్ ఖాన్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.ఎందుకంటే పరిచయం అక్కరలేని పేరు,నటుడు ఆయన.ఆయన కొన్ని చిత్రాలు టాలీవుడ్ లో మంచి ప్రేక్షక ఆదరణ పొందాయి కూడా.లగాన్,తారే జమీన్ పర్, దంగల్ లాంటి కొత్త తరహా కథలతో ఆయన అలరించిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఆయన మొదటి భార్య కూతురు ఇరా ఖాన్ ప్రేమలో పడింది అన్న వార్తలు గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి.రీసెంట్‌గా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్ లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అంటూ.

అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పే కార్యక్రమం ఒకటి పెట్టుకుంది.

బాయ్ ఫ్రెండ్ తో డ్యాన్స్ ఆడిన

ఈ క్రమంలో ఆమెను ఓ అభిమాని ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నారా.? అని ప్రశ్నించడం తో బదులుగా ఇరాఖాన్ ఫోటోను షేర్ చేసి అతనితో డేటింగ్‌లో ఉన్నట్టు చెప్పకనే చెప్పింది.అనంతరం తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఇరా డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా ఒకటి షేర్ చేయడం తో ఈ విషయం తేటతెల్లమైంది.

డ్యాన్స్ చేయడమే కాకుండా అతడిని గట్టిగా హగ్ కూడా చేసుకుంది.ప్రస్తుతం ఇరా కు చెందిన ఈ వీడియో సోషల్ మీడియా హల్ చల్ చేస్తుంది.అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం తన తండ్రి బాటలోనే ఇరా పయనిస్తుంది అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube