బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ మళ్లీ ప్రేమలో పడింది.తండ్రి స్టార్ హీరో కావడంతో ఐరా ఖాన్ కూడా భవిష్యత్తులో సినిమా రంగంలోకి వస్తుందని ఫ్యాన్స్ భావించినా ఆమె మాత్రం తనకు ఫిలిం మేకర్ కావాలని ఉందని సినిమాల్లో నటించడం ఇష్టం లేదని గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఏడాదిక్రితం ఐరా మిషాల్ అనే యువకునితో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐరా అప్పట్లో మిషాల్ తో దిగిన ఫోటోలకు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే మిషాల్ కు, ఐరాకు అభిప్రాయ బేధాలు రావడంతో వాళ్లిద్దరూ విడిపోయారు.అయితే ఐరా ప్రస్తుతం అమీర్ ఖాన్ ఫిట్ నెస్ ట్రైనర్ నుపూర్ షీఖరేతో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.గత కొన్ని సంవత్సరాలుగా నుపూర్ అమీర్ ఖాన్ కు ఫిట్ నెస్ ట్రైనర్ గా ఉన్నారు.
అమీర్ ఖాన్ తో పాటు ఐరాకు కూడా నుపూర్ గత కొన్ని నెలల నుంచి వర్కౌట్లు చేయిస్తున్నారు.అయితే నుపూర్ ప్రవర్తన, మాటతీరు నచ్చడంతో ఆమె నుపూర్ తో డేటింగ్ లో ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.అయితే ఐరా మాత్రం వైరల్ అవుతున్న వార్త గురించి స్పందించలేదు.ఇప్పటికే ఐరా తన తల్లికి ప్రేమ విషయం చెప్పిందని ఆమె తల్లి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఐరా, నుపూర్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా వీళ్లిద్దరూ ఈ మధ్య కాలంలో పార్టీలు కూడా చేసుకున్నారని తెలుస్తోంది.ఐరా ఖాన్ డేటింగ్ గురించి వైరల్ అవుతున్న వార్తలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.