సూపర్‌ స్టార్‌ 250 కోట్ల విరాళం నిజమెంత?  

Amir Khan Corona Virus Modi And Amirkhan - Telugu Amirkhan, Amirkhan Donate The 250 Cr To Corona Effected Peoples, Amirkhan Latest Update, Bollywood And Tollywood, Corona Virus, India Lock Down, Modi And Amirkhan, Social Media

కరోనాతో పోరాటంకు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు తమవంతు సాయంను అందిస్తున్న విషయం తెల్సిందే.బాలీవుడ్‌, టాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన వారు ఎంతో మంది సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

 Amir Khan Corona Virus Modi And Amirkhan

ఈ సమయంలోనే బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమీర్‌ ఖాన్‌ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి 250 కోట్ల విరాళంను ప్రకటించాడు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది.

ప్రముఖ మీడియాల్లో ఈ విషయం గురించి అధికారికంగా వార్తలు రాలేదు, అలాగే ఆమీర్‌ ఖాన్‌ కూడా తన సోషల్‌ మీడియా పేజీల్లో పోస్ట్‌ చేయలేదు.

సూపర్‌ స్టార్‌ 250 కోట్ల విరాళం నిజమెంత-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దాంతో ఈ విషయంలో నిజం ఎంత అనే విషయం గురించి కొందరు ఎంక్వౌరీ చేయగా అసలు ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం అని తేలిపోయింది.ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఒకటి ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చింది.

సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని, మోడీని ఆమీర్‌ కలిసిన విషయం నిజం కాదని చెప్పారు.ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కనిపిస్తున్న వీడియోలు ఇంకా ఫొటోలు అయిదు సంవత్సరాల క్రితం మోడీని ఆమీర్‌ కలిసిన సందర్బంగా తీసినవిగా పేర్కొన్నారు.ఇప్పటి వరకు కరోనాపై యుద్దంకు ఆమీర్‌ విరాళంను ప్రకటించలేదు.బాలీవుడ్‌ నుండి అక్షయ్‌ కుమార్‌ మాత్రమే పాతిక కోట్ల విరాళంను ప్రకటించి నెం.1 స్థానంలో ఉన్నాడంటూ ఆ మీడియా సంస్థ పేర్కొంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amir Khan Corona Virus Modi And Amirkhan Related Telugu News,Photos/Pics,Images..