డ్రగ్ ఫ్రీ ఇండియా అంటున్న అమీర్ ఖాన్! సోషల్ మీడియా కాంపైన్!  

బాలీవుడ్ లో స్టార్ హీరో అమీర్ ఖాన్ అంటే ఎప్పుడు ప్రత్యేకమే అని చెప్పాలి. చాలా మంది హీరోలు తమ క్రేజ్ ని ఆదాయం పెంచుకోవడానికి ఉపయోగిస్తే అమీర్ ఖాన్ మాత్రం తన ఇమేజ్ ని సామాజిక చైతన్యం కోసం, సమాజ సేవ కోసం ఉపయోగిస్తూ ఉంటాడు. అందుకే బాలీవుడ్ లో అమీర్ ఖాన్ వ్యక్తిత్వం అంతే అందరికి భాగా నచ్చుతుంది. ఇప్పటికే సత్యమేవ జయతే అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంది నిర్భాగ్యులకి, అనాధాలకి తాను సాయం అందిస్తూ, ఎంతో మందిని సహాయం చేసే విధంగా చైతన్యం చేసి మంచి గుర్తింపు పొందాడు. ఇక సామాజిక సేవా కార్యక్రమాలలో, ప్రజలకి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో తనదైన పంథాలో వెళ్ళే అమీర్ ఖాన్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాడు.

Aamir Khan About Drugs Free India-Aamir Drug Abuse By Youth Is A Matter Of Concern India

Aamir Khan About Drugs Free India

ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా యువతరం డ్రగ్స్ కి ఎ విధంగా బానిసలుగా మారుతున్నారో అందరికి తెలిసిందే. ఈ డ్రగ్స్ కారణంగా సమాజం నుంచే కాకుండా, చట్టం ముందు కూడా యువతరం తమని తాము చెడు వ్యక్తులుగా చూపించుకుంటుంది. ఇక ఉన్నత కుటుంబాలలో పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు డ్రగ్స్ మత్తులో వుండే వారు ప్రపంచంతో సంబంధం లేకుండా జీవితాలని ఎంజాయ్ చేస్తారు. అలాగే మురికివాడలలో వుండే పిల్లలు కూడా మత్తుపదార్ధాలకి అలవాటు పడటమే కాకుండా వాటి కారణంగా క్రిమినల్స్ గా కూడా మారుతున్నారు. ఇలాంటి ఘటనలని ద్రుష్టిలో వుంచుకొని అమీర్ ఖాన్ డ్రగ్స్ ఫ్రీ ఇండియా కాంపైన్ కి పిలునిచ్చాడు. డ్రగ్ ఫ్రీ ఇండియా పేరుతో ఫిబ్రవరి 18, 19 తేదీలలో దేశ వ్యాప్తంగా జరిగే కంపైన్ లో అమీర్ ఖాన్ పాల్గొని చైతన్యం తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. ఈ కార్యక్రమం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆద్వర్యంలో జరుగుతుంది.