బిడెన్ వ్యూహం.. ట్రంప్ దూకుడు.. గెలుపు ఎవ‌రిది..?

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా మూడు పార్టీలు త‌ల‌ప‌డుతున్నాయి.స్థానికంగా పెద్ద‌గా  దూకుడు లేని గ్రీన్ పార్టీ, ఇక‌, ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న డెమొక్రాట్లు, అమెరికాలో అధికారంలో ఉన్న రిప‌బ్లిక‌న్లు.

 Who Will Win In America Presidential Elections,america,president,donald Trump,jo-TeluguStop.com

ఈ మూడు పార్టీల్లోనూ ప్ర‌ధాన పోటీ.డెమొక్రాట్లు, రిప‌బ్లిక‌న్‌ల మ‌ధ్యే ఉంటుంది.

ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ట్రంప్‌.రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌ఫున ప్రాధాన్యం వ‌హిస్తున్నారు.

ట్రంప్ రెండోసారి కూడా అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్టాల‌నే ఆశ‌తో ఉన్నారు.ఈ నేప‌థ్యంలో ఆయ‌న గ‌త 2016 ఎన్నిక‌ల్లో చూపించిన దూకుడుతోనే ముందుకు సాగుతున్నారు.

ప్ర‌త్య‌ర్థుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

త‌న‌కు ఓటేయ‌క‌పోతే.

అమెరిక‌న్లు ఈ దేశ పౌరులేకాద‌ని కూడా వ్యాఖ్య‌లు కుమ్మ‌రిస్తున్నారు.అదే స‌మ‌యంలో త్వ‌ర‌లోనే క‌రోనాకు వ్యాక్సిన్ తీసుకువ‌చ్చి.

మ‌హ‌మ్మారిని దేశం నుంచి వెళ్ల‌గొడ‌తాన‌ని హామీలు ఇస్తున్నారు ట్రంప్‌.ఇక‌, క‌రోనావ్యాప్తి, వైర‌స్ పుట్టుక విష‌యంలో చైనాను ప్ర‌పంచ కోర్టు ముందు నిల‌దీస్తాన‌ని, త‌న‌ను మ‌రోసారి గెలిపిస్తే.

అమెరికా న‌డ‌క‌ను మ‌రో వందేళ్ల ముందుకు నిలుపుతాన‌ని చెబుతున్నారు.ఇక‌, నాలుగేళ్ల పాల‌నలో చేసిన ప్ర‌యోగాల‌ను, ట్రంప్ తెంప‌రిత‌నాన్ని.

ప్ర‌త్య‌ర్థి జోబిడెన్ ఉటంకిస్తున్నారు.మెక్సికో గోడ‌తో వ‌చ్చిన అన‌ర్థంపై ఆయ‌న వివ‌రిస్తున్నారు.

ప్ర‌పంచ దేశాల‌కు అమెరికా ఇప్ప‌టికే దూర‌మైంద‌ని, ట్రంప్ వైఖ‌రి ఇలానే కొన‌సాగితే.మ‌రింత‌గా ప్ర‌మాదం పొంచి ఉంద‌ని అంటున్నారు.ఇక‌, క‌రోనాపై ట్రంప్ వ్య‌వ‌హార‌శైలిని కూడా బిడెన్ దుయ్య‌బ‌డుతున్నారు.అమెరిక‌న్ల‌లో చీలక తెచ్చి.

తాను గెల‌వాల‌ని ట్రంప్ భావిస్తున్నార‌న్న బిడెన్ వ్యాఖ్య‌లు రెండు రోజులుగా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.గ‌త ప‌రిస్థితులు.

ట్రంప్ వ‌చ్చాక ఏర్ప‌డిన ప‌రిస్థితుల‌ను అక్క‌డి వారు భేరీజు వేసుకుంటున్నారు.ట్రంప్ వ్య‌వ‌హార శైలిలో నిల‌క‌డ‌లేని త‌నం.

ఆయ‌న దూకుడు దేశానికి చేసిన అన‌ర్థం వంటివి చ‌ర్చ‌కువ‌చ్చాయి.దీంతో బిడెన్ వ్యూహం బాగానే సాగుతోంద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

దీంతో ట్రంప్ దూకుడు నెగ్గుతుందా.లేక బైడెన్‌కు ప్ర‌జ‌లు జై కొడ‌తారా? అనే విష‌యం ఆస‌క్తిగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube