డెల్టా దెబ్బకు భయపడుతున్న అమెరికన్స్...ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా...!!!

కరోనా మొదటి వేవ్ లో అమెరికా తీవ్ర ఆర్ధిక అంతకంటే ఎక్కువగా ప్రాణ నష్టాన్ని చవి చూసింది.ఎంతో మంది అమెరికన్స్ అనాధలుగా మృతి చెందారు.

 Americans Who Are Afraid Of The Delta Blow  Do You Know What They Are Doing Righ-TeluguStop.com

వారి శవాలను కనీసం చూసుకునే వీలు లేక దుర్భర పరిస్థితుల మధ్య దహన సంస్కారాలు చేయాల్సి వచ్చింది.ఒక పక్క కరోనా మరో వైపు బయటకు వెళ్తే కరోనా వైరస్ వ్యాపించే పరిస్థితి, సరైన తిండిలేక, ఉద్యోగం కోల్పోయి, డబ్బులు లేక ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారు అమెరికన్స్.

అయితే ప్రస్తుతం డెల్టా వేరియంట్ తీవ్ర స్థాయిలో అమెరికాలో వ్యాప్తి చెందుతున్న క్రమంలో పెద్దన్న అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోంది.కరోనా మొదటి వేవ్ ధాటిని చవి చూసిన అగ్ర రాజ్య ప్రజలకు డెల్టా వేరియంట్ ను తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుట్టుకొస్తోంది.దాంతో వ్యాక్సినేషన్ విషయంలో అమెరికన్స్ స్పీడు పెంచారు.నిన్నా మొన్నటి వరకూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆలోచించిన అమెరికన్స్ ఇప్పుడు వ్యాక్సినేషన్ కోసం క్యూ కడుతున్నారు.

గతంలో చాలామంది అమెరికన్స్ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వేసుకున్నారు.

Telugu America, Americansafraid, Delta, Johnsonjohnson, Medarna Vaccine, Pfizer,

జాన్సన్ అండ్ జాన్సన్ అప్పట్లో కేవలం సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.అంటే రెండవ సారి వ్యాక్సిన్ వేసుకునే అవసరం లేదన్నమాట.కానీ తాజా పరిసోధనల్లో ఈ వ్యాక్సిన్ కరోనా రాకుండా నియంత్రిచగలిగే శక్తిని కేవలం 70% మాత్రమే కలిగి ఉందని తేలడంతో ఇప్పుడు అమెరికన్స్ ఆందోళన చెందుతున్నారు.

డెల్టా వేరియంట్ తీవ్రత ఉద్రక్త మవుతున్న సమయంలో డెల్టా పై ఫైజర్, మేడార్నా వ్యాక్సిన్ లు 90 శాతం సమర్ధవంతంగా పనిచేస్తాయని తేలడంతో రెండవ డోస్ గా ఫైజర్, మేడార్నా వేసుకుంటున్నారు.అయితే మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండవ డోస్ కుడా అదే వ్యాక్సిన్ తీసుకోవాలనే నిభందన ఉండటంతో ప్రస్తుతం ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube