అమెరికన్స్ కి ట్రంప్ కీలక ఆదేశాలు…????  

Americans Trump Orders Corona Effect -

అమెరికాలో కరోనా సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు.వేలాది మంది కరోనా బారిన పడి మృతి చెందుతున్నారు, లక్షలాది మంది ప్రజలకి కరోనా పాజిటివ్ అని తేలింది.

 Americans Trump Orders Corona Effect

దాంతో దిక్కు తోచని స్థితిలో అమెరికా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలాఉంటే అమెరికా వ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు మూసివేయబడ్డాయి.

షాపింగ్ మాల్స్, నిత్యవసర వస్తువులు దొరకక అమెరికన్స్ వలస దారులు అందరూ అల్లాడి పోతున్నారు.ఇదిలాఉంటే.

అమెరికన్స్ కి ట్రంప్ కీలక ఆదేశాలు…-Telugu NRI-Telugu Tollywood Photo Image

అమెరికా పౌరులు విదేశాలలో ఎక్కడ ఉన్నా సరే వచ్చేయండి అంటూ ట్రంప్ అమెరికన్స్ కి పిలుపునిచ్చారు.ప్రపంచ దేశాల్లో ఉండే అమెరికన్స్ అందరూ వచ్చేయండి అంటూ ట్రంప్ సర్కార్ కీలక ప్రకటన చేసింది.

మీరు సొంత దేశానికి వచ్చేయాలని అనుకుంటే నిమిషం కూడా ఆలస్యం చేయద్దు వచ్చేయండి అగ్ర రాజ్యానికి వచ్చే అన్ని రకాల విమానయాన సర్వీసులు త్వరలో రద్దు చేసే పరిస్థితి రావచ్చు అంటూ ప్రకటించారు.

అమెరికన్స్ కోసం కొన్ని దేశాలకి ప్రత్యేకంగా విమానాలు పంపినా వారికి వచ్చే పరిస్థితి ఉండే లేదో కూడా తెలియదు.

ఎవరెవరు అమెరికాకి వచ్చేయాలని అనుకుంటున్నారో వారందరూ వచ్చేయండి.మీరు మీ దగ్గరలో ఉన్న అమెరికన్ ఎంబసీకి మీ వివరాలు చెప్పండి అంటూ అమెరికా సెక్రెటరీ ప్రకటించారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Americans Trump Orders Corona Effect Related Telugu News,Photos/Pics,Images..