ట్రంప్ కి మద్దతుగా భారీ విరాళాలు..అమెరికాలో సీన్ మారుతుందా..??

అమెరికాలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి నవంబర్ 3 వ తేదీన జరగనున్న అధ్యక్ష ఎన్నికలకి రంగం సిద్దమవుతోంది.ఇప్పుడు అమెరికాలో ఎక్కడ చూసిన ఎన్నికల హడావిడే.

 Americans Support Donald Trump, Donald Trump, Americans, Presidental Elections,-TeluguStop.com

ప్రజలని ప్రసన్నం చేసుకోవడానికి ఇరు పార్టీలు చేయని ప్రయత్నాలు లేవు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటూ ప్రచారంలో హీట్ పుట్టిస్తున్నారు.ఇదిలాంటే గడించిన కొన్ని నెలలుగా వస్తున్నా సర్వేలల్లో ట్రంప్ పరాజయం పాలవ్వడం ఖయామని ,వచ్చే ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా బిడెన్ కి ఛాన్స్ ఉందంటున్న వారు కూడా లేకపోలేదు…అయితే తాజాగా ట్రంప్ కి ప్రజా మద్దతు క్రమ క్రమంగా పెరుగుతోందని అంటున్నారు నిపుణులు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ప్రచారాన్ని ప్రారంభించిన ట్రంప్ వర్గం ఈ క్రమంలోనే ఎన్నికల నిధుల కోసం పెద్ద ఎత్తున విరాళాలు సేకరించారు.రిపబ్లికన్ పార్టీ డోనాల్డ్ ట్రంప్ వర్గం ఇద్దరూ సంయుక్తంగా ప్రారంభించిన నిధుల వేటలో ట్రంప్ కి ఊహించని విధంగా విరాళాలు వెల్లువలా వచ్చిపడ్డాయి.కేవలం ఒక్క జులై నెల కాలంలోనే 16.5 కోట్ల డాలర్లు ఎన్నికల నిధులుగా రావడం అందరిని ఆశ్చర్యంలోకి ముంచెత్తింది.ట్రంప్ పై అమెరికన్స్ అసంతృప్తితో ఉన్నారు విదేశీయ ఓట్లు కూడా అస్సలు పడే అవకాశం లేదంటున్న తరుణంలో ఊహించిని విధంగా ఇలా విరాళాలు వచ్చి పడటం అమెరికాలో సీన్ ట్రంప్ కి అనుకూలంగా మారుతుందా అనే సందేహాలని కలిగిస్తోందని అంటున్నారు పరిశీలకులు.ఇదిలాఉంటే

ఎన్నికల నిధుల సేకరణ మొదలు ఇప్పటివరకూ మొత్తం 1.1 బిలియన్ డాలర్లు విరాళంగా వచ్చాయని, ఈ మొత్తంలో దాదాపు 30 కోట్ల డాలర్ల వరకూ ఖర్చు చేయడానికి వీలుగా నగదు రూపంలో ఉందని రిపబ్లికన్ నేషనల్ కమిటీ ప్రకటించింది.ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం 300 మంది కార్యకర్తలని నియమించుకోగా ఇప్పటివరకూ ట్రంప్ కోసం పనిచేస్తున్న కార్యకర్తల సంఖ్య 1500 కి చేరుకుకంది.

అయితే తాజా లెక్కల ప్రకారం ట్రంప్ కి ఊహించని విధంగా ప్రజా మద్దతు పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube