అమెరికాలో ఆంధ్రా సొరకాయలు..ఎగబడుతున్న అమెరికన్స్..!!!

ఆంధ్ర ప్రజలకి అత్యంత ప్రీతి పాత్ర మైన కూరగాయలలో సొరకాయ ఒకటి.ఎంతో ఇష్టంగా వండుకునే సొరకాయలను ఏపీలో పలు ప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.

 Indian Origin Selling Bottle Guards In America, Americans, Bottle Guards, Corona-TeluguStop.com

అయితే ప్రస్తుతం హైబ్రీడ్, నాటు సొరకాయలు అన్ని చోట్లా దర్శనం ఇస్తున్నాయి.పలు దేశాలలో సైతం సొరకాయలను ఇష్టంగానే తింటారు.

అయితే సేంద్రీయ పద్దతులలో పండించే సోరకాయకు, రసాయన మిళితంగా ఎరువులు వేసి పండించిన సోరకాయకు ఎంతో తేడా ఉంటుంది.సహజంగా పండించిన సొరకాయకు ఉన్న రుచి మరెలా పండించినా దొరకదు.

అందుకే కాబోలు ఆంధ్రా సొరకాయలు అంటే అమెరికన్స్ ఎగబడి మరీ తీసుకెళ్తున్నారట.

ఏపీలోని కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చినకళ్ళెపల్లి గ్రామానికి చెందిన గుత్తికొండ కాంతి కిరణ్ అనే వ్యక్తి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.

కిరణ్ అమెరికాలో తాను ఉంటున్న నివాసంలోని పెరటిలో కూరగాయలు పండిస్తున్నారు.ఆయన పండించిన కూరగాయలంటే చుట్టుపక్కల అమెరికన్స్ కి ఎంతో ఇష్టమట.ముఖ్యంగా కిరణ్ పండిస్తున్న కూరగాయలలో సోరకాయలను ఎంతో ఇష్టంగా తీసుకువెళ్తున్నారట అమెరికన్స్ ఎందుకంటే.

ఎంతో సహజసిద్ధంగా, ఎలాంటి ఎరువులు వేయకుండా కిరణ్ వాటిని పండిస్తున్నారట.

అంతేకాదు అవి ఆంధ్రాలోని కృష్ణా జిల్లాకి చెందిన కాయలు కావడం కూడా ఓ కారణం.కిరణ్ తన సొంత ఊరుకు వెళ్ళినపుడు అక్కడ సహజసిద్దమైన విత్తనాలు సేకరించి వాటిని అమెరికా తీసుకువెళ్ళి పెరట్లో నాటాడు.

కేవలం 45 రోజుల వ్యవధిలోనే కాయలు కోతకి వచ్చేశాయట.సహజంగా ఒక పాదు 40 నుంచీ 50 కాయలు కాస్తుంది.

కానీ కిరణ్ వేసిన పాదుకు మాత్రం 100 కాయలు కాస్తున్నాయట.ఎంతో రుచిగా ఉండటంతో వాటిని అమెరికన్స్ ఎంతో ఇష్టంగా తీసుకువెళ్తున్నారంటున్నారు కిరణ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube