త్రీపుల్ రిలేషన్‌షిప్: కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేటీ హిల్

కాలిఫోర్నియా డెమొక్రాటిక్ పార్టీ కాంగ్రెస్ సభ్యురాలు కాటీ హిల్ ఆదివారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఆమె వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలపై శాసనసభ డైరెక్టర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా హౌస్ ఎథిక్స్ కమిటీ దర్యాప్తు జరిపింది.

 Americancongressrep Katie Hillresigns Amid Ethicsprobe Intoreportedaffair-TeluguStop.com

ఈ క్రమంలో ఆదివారం ట్వీట్టర్ ద్వారా స్పందించిన ఆమె తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నాన్నట్లు ప్రకటించారు.

ఇది తనకు చాలా కష్టంగా ఉందని.

కానీ తన నియోజకవర్గం, సమాజం, దేశం దృష్టిలో మంచి నిర్ణయంగానే భావిస్తున్నట్లు హిల్ పేర్కొన్నారు.ఈ వారం చివరి నాటికి ఆమె పదవీ బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం కనిపిస్తోంది.

కొద్దిరోజుల క్రితం ఆమె భర్త కెన్నీ హెస్లెప్‌తో పాటు మరో మహిళతో సంబంధం కలిగివున్నారంటూ వార్తలు వచ్చాయి.హిల్ రాజీనామా చేసిన విషయాన్ని హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ధ్రువీకరించారు.

Telugu Katie Hill, Katiehill, Telugu Nri Ups-

  కేటీ హిల్ ధృఢమైన నిబద్ధతతో పనిచేశారని.భవిష్యత్తు తరానికి బలమైన పునాది వేసేందుకు కాంగ్రెస్‌కు వచ్చారని స్పీకర్ తెలిపారు.ఫ్రెష్మాన్ వర్గం నుంచి నాయకురాలిగా ఎదిగిన వైనాన్ని నాన్సి కొనియాడారు.గత గురువారం ఆమె నగ్నంగా ఉన్న ఫోటోలతో పాటు ప్రచార సిబ్బందిని ముద్దాడుతున్నట్లుగా వచ్చిన ఫోటోలను ప్రముఖ పత్రిక డైలీ మెయిల్ ప్రచురించడంతో కేటీ హిల్ రాజకీయంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.Redstate.org లో కేటీ హిల్ త్రీ పర్సన్స్ రిలేషన్‌షిప్ ముగిసినట్లుగా స్క్రీన్‌షాట్లను ప్రచురించిన వెంటనే డైలీ మెయిల్‌ ఈ ఫోటోలను పోస్ట్ చేసింది.కాగా… తన వ్యక్తిగత ఫోటోలు తనపైనే ఆయుధాలుగా పనిచేశాయని.ఇది తన వ్యక్తిగత గోప్యతపై భయంకరమైన దాడని అంతేకాకుండా చట్టవిరుద్ధం కూడా అని కేటీ హిల్ తన రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సంఘటనపై న్యాయపరమైన సలహా తీసుకుంటామన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube