తెలుగులో ఫుడ్ ఆర్డర్.. అమెరికా పౌరుడి పట్టుదలకి భారతీయులు ఫిదా, వీడియో వైరల్

దేశభాషలందు తెలుగు లెస్స’ అన్నారు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు.‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’ అన్నారు వెనీషియన్‌ యాత్రికుడు నికోలో డి కాంటే.ఇప్పటికీ ఇవే మాటలను ఉటంకిస్తూ సంబరపడిపోతుంటారు మన భాషాభిమానులు.1000 ఏళ్లకు పైగా ఘన చరిత్ర వున్న తెలుగు భాష ఇప్పుడు మృత భాషగా మారే ప్రమాదం పొంచి వుంది.ఏ యేటికాయేడు తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది.ఇంటర్‌నెట్, స్మార్ట్‌ ఫోన్‌ల ప్రవేశంతో గత రెండు దశాబ్దాల్లో భారతదేశంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి.

 American Youtuber Speaks Telugu At Indian Restaurants In Us , American , Youtube-TeluguStop.com

టెక్నాలజీ మన జీవితాల్లోకి ఇంతగా వచ్చేయడంతో అంతా ఇంగ్లీష్ మయమే.

పరీక్షలో పాసయ్యేంత నేర్చుకుంటే చాలు అనుకునే ఓ సబ్జెక్ట్‌గానే మిగిలిపోయింది తెలుగు.

అంతేకాదు తల్లిభాషలో కూడా ఫెయిల్ అయ్యే దౌర్భాగ్యం మన పిల్లలకు పట్టుకుందంటే.మన విద్యా వ్యవస్థ, తల్లిదండ్రులు ఏ స్థాయిలో తెలుగు పట్ల శ్రద్ధ వహిస్తున్నారో అర్ధమవుతోంది.

ఎక్కడో ఇంగ్లాండు నుంచి వచ్చి, ఉద్యోగ శిక్షణలో భాగంగా తెలుగు నేర్చుకుని, మన భాషపై మమకారం పెంచుకొని, తాళపత్రాలు సైతం సేకరించి, మిణుకు మిణుకు మంటున్న తెలుగు దీపాన్ని వెలిగించారు సర్ సీపీ బ్రౌన్.ఒక విదేశీయుడు తెలుగు భాష కోసం అంత చేయగలిగినపుడు, మన ప్రభుత్వాలు, తెలుగు ప్రజలు మన భాషా సంరక్షణ కోసం ఇంకెంత చేయవచ్చు.

ఇకపోతే.తెలుగు భాషపై అభిమానాన్ని చాటుకోవడమే కాకుండా, అనర్గళంగా మాట్లాడి షాకిచ్చారు అమెరికాకు చెందిన యూట్యూబర్ జియోమా.భారతీయ భాషలను నేర్చుకోవడాన్ని ఎంతో ఇష్టపడే ఆయన.అమెరికాలో విస్తృతంగా మాట్లాడే భారతీయ భాషలలో ఒకటైన తెలుగుపై ఫోకస్ పెట్టాడు.దీనిలో భాగంగా న్యూజెర్సీలో పర్యటించిన జియోమా.అక్కడి భారతీయ రెస్టారెంట్‌లను సందర్శించి తెలుగులోనే ఫుడ్ ఆర్డర్ చేసి షాకిచ్చాడు.తొలుత అతను పరివార్ డిలైట్స్ అనే రెస్టారెంట్‌కి వెళ్లి ఇరానీ ఛాయ్‌ని ఆర్డర్ చేస్తాడు.అతని తెలుగుకి అక్కడ కౌంటర్‌లో వున్న వారు షాకవ్వడమే కాకుండా జియోమాని అభినందించారు.

దీని తర్వాత జియోమా అక్కడికి దగ్గరలోని హైదరాబాద్ హౌస్ అనే రెస్టారెంట్‌కి వెళ్లి మటన్ బిర్యానీని ఆర్డర్ చేశాడు.బిర్యానీ చాలా బాగుందని తెలుగులోనే ఫీడ్ బ్యాక్ ఇవ్వడంతో అక్కడి వారు షాకై ఫ్రీగా టీ ఇచ్చారు.

ఆపై సప్తగిరి టేస్ట్ ఆఫ్ ఇండియా, గోల్కొండ చిమ్నీలలో జియోమాకి ఇదే అనుభవం ఎదురైంది. జియోమా ఆన్‌లైన్‌లో తెలుగు నేర్చుకున్నాడు.

జీవితంలో ఎప్పుడూ భారతదేశానికి వెళ్లని ఆయన, త్వరలోనే ఇండియా టూర్‌కి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపాడు.మొత్తానికి తన తెలుగుతో మన తెలుగువారికే షాకిచ్చాడు జియోమా.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube