ఇసాక్ రిచర్డ్స్ యూట్యూబ్ ఛానల్  

American Youth Isaac Richards Telugu Speaking Video-telugu Speaking English Peoples,telugu Viral News Updates,viral In Social Media

ఇసాక్ రిచర్డ్స్ ఇప్పుడు ఈ పేరు బాలా పాపులర్ అయిపొయింది. ఒక ఇంగ్లిష్ కుర్రాడు అనర్గళంగా తెలుగు మాట్లాడి అందరిని ఆకట్టుకున్న రిచర్డ్స్ ఇప్పుడు తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాడు. తెలుగువారి కోసమే రిచర్డ్స్ ఈ యూట్యూబ్ ఛానెల్ ని మొదలు పెట్టాడు..

ఇసాక్ రిచర్డ్స్ యూట్యూబ్ ఛానల్ -American Youth Isaac Richards Telugu Speaking Video

ఈ ఛానెల్ లో కూడా గుక్కతిప్పుకోకుండా తెలుగు మాట్లాడేస్తూ పాటలు పడుతూ తనదైన శైలి లో ఆకట్టుకుంటున్నాడు. ఇక ప్రతి వారం టచ్ లో ఉంటానని చెబుతూ వారం వారం ఏమి చేయాలి అన్న దానిపై నాకు సలహాలు ఇవ్వండి అంటూ రిచర్డ్స్ కోరాడు. మీరంతా నాకు అక్కలు, అన్నలు, తమ్ముళ్లు అని నాకు సలహాలు ఇవ్వండి అంటూ కోరాడు.

అలానే నాకు తెలుగు నేర్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అని తెలిపాడు. మంచు లక్ష్మి గారు నా తెలుగు కంటే నీవు తెలుగు బాగా మాట్లాడుతున్నావు అని కామెంట్ చేసారు. చాలా ధన్యవాదాలు, మీ తెలుగు కంటే నాది బెటర్ కాదు కానీ అలా కామెంట్ చేసినందుకు చాలా థాంక్స్ అంటూ రిచర్డ్స్ తెలిపాడు.

మొత్తానికి అనర్గళంగా తెలుగు మాట్లాడుతూ మంచి పాపులర్ అయిన రిచర్డ్స్ కూడా యూట్యూబ్ ఛానెల్ మొదలు పెట్టి మరింత పాపులర్ అవ్వాలని చూస్తున్నాడు.

అందుకే వారం వారం యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు వారందరికీ దగ్గర కావాలని రిచర్డ్స్ భావిస్తున్నాడు. ఈ ఛానల్ ద్వారా తెలుగు కూడా బాగా నేర్చుకోవాలని కూడా అనుకుంటున్నాడు. ఇక ఇప్పుడు వారం వారం అతడు యూట్యూబ్ ఛానల్ లో కనిపించనున్నాడు.