అలాంటి పనులు చేసినందుకు ఏకంగా 180 ఏళ్ళు జైలు శిక్ష

ఇండియాలాంటి దేశాలలో ఏదైనా తప్పు చేస్తే యావజ్జీవ కారాగార శిక్ష, లేదంటే ఉరి శిక్ష వేస్తారు.అయితే ఆ మధ్య అమ్మాయిలపై లైంగిక వేధింపులకి పాల్పడి అత్యాచారం చేసినట్లు ఆధారాలతో సహా దొరికిన డేరా బాబాకి ఏకంగా 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది.

 American Youth Basketball Coach Gets 180 Years In Jail-TeluguStop.com

ఇదే ఇండియాలో అత్యధిక సంవత్సరాల జైలు శిక్షగా చెప్పుకోవచ్చు.అయితే విదేశాలలో అత్యాచారం, లైంగిక వేదింపుల కేసులలో దొరికితే అక్కడ శిక్ష దారుణంగా ఉంటాయని చాలా తక్కువ మందికి తెలుసు.

కొన్ని దేశాలలో ఉరి శిక్షలు ఉండవు అయితే బ్రతికున్నంత వరకు జైలు జీవితం అనుభవించాలని శిక్షించే అవకాశం ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా బాలురుపై లైంగిక వేధింపులకు పాల్పడిన బాస్కెట్‌బాల్ కోచ్‌కు అమెరికాలోని ఓ కోర్టు 180 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది.

గ్రెగ్ స్టీఫెన్ ప్రముఖ బాస్కెట్‌బాల్ క్లబ్‌కు కోచ్‌గా వ్యవహిస్తు కోచింగ్ కి వచ్చే అబ్బాయిలని లైంగికంగా వేధించేవాడు.ఇలా 20 ఏళ్లపాటు ఎవరికీ తెలియకుండా రహస్య కార్యకలాపాలు సాగించిన 43 ఏళ్ల గ్రెగ్ స్టీఫెన్ చివరకు జైలుపాలయ్యాడు.

గ్రెగ్ దాచుకున్న ఓ పెన్‌డ్రైవ్‌లో అతడు అబ్బాయిలతో ఉన్న చిత్రాలుండటం చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.గ్రెగ్ ఇప్పటివరకూ దాదాపు 440 మంది అబ్బాయిలను లైంగికంగా వేధించినట్లు ఆధారాలు లభించాయి.

దీంతో గ్రేగ్‌ చేసిన నేరం క్షమించదగినది కాదని భావించిన కోర్టు అతనికి ఏకంగా 180 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube