ఉగ్రదాడికి కుట్ర పన్నిన...అమెరికా కుర్రాడు..!!!  

American Youngster Into Terrorism-

అమెరికా కుర్రాడు తన సొంత దేశంలోనే ఉగ్రదాడికి కుట్ర పన్నాడు.18 ఏళ్ల వయసులో అతడి ఆలోచనలు చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు.చివరికి అమెరికా పోలీసులు అరెస్ట్ చేయడంతో ఊచలు లెక్కిస్తున్నాడు.వివరాలలోకి వెళ్తే.డల్లాస్ కి చెందినా 18 ఏళ్ల కుర్రాడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ 1400 డాలర్లు సంపాదించి మారణాయుధాలు, బులెట్ ప్రూఫ్ కోట్లు వంటి సామగ్రి కొనుగోలు చేశాడు.

American Youngster Into Terrorism--American Youngster Into Terrorism-

అక్కడితో ఆగకుండా తన స్నేహితుల నుంచీ డబ్బులు తీసుకుని కొన్ని తుపాకులు కూడా కొనుగోలు చేశాడు.నార్త్ టెక్సాస్ మాల్‌లో కాల్పులు జరపడానికి కుట్ర పన్నానని తనతో పాటు రావాలని వారిని కోరాడు వారిలో ఎంత మంది ఒప్పుకున్నారో ఇంకా పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

అయితే

18 ఏళ్ల కుర్రాడు తుపాకులు కొనుగోలు చేశాడు అని తెలియగానే అతడిపై పోలీసులు నిఘా ఉంచారు.అతను చేస్తున్న పనులు తెలుసుకొని సాక్ష్యాలతో సహా అతన్ని అదుపులోకి తీసుకున్నారు.అయితే తానూ ఇస్లామిక్ స్టేట్ ప్రభావంతోనే ఈ ఉగ్రదాడికి పథకం వేసినట్లు అంగీకరించాడు.దాంతో అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.