మొక్కే కదా అని పీకితే...మైండ్ బ్లాక్ అయ్యింది...!!!  

American Women Struck When See The Plastic Plant - Telugu . America California Women, Loves The Plants, Plastic Plant, Telugu Nri Latest Update

అమెరికాలోని కాలిఫోర్నియా కి చెందిన ఓ మహిళకి మొక్కలు అంటే విపరీతమైన ప్రేమ.ఇంట్లో అన్నీ మొక్కలే.

American Women Struck When See The Plastic Plant

వెరైటీ వెరైటీ మొక్కల కోసం ప్రపంచం అంతా వెదుకుతూ ఉంటుంది.ఎక్కడైనా తనకి నచ్చిన మొక్క కనపడితే చటుక్కున కొనేస్తుంది.

అంతేనా తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసి తన మొక్క సొగసు గురించి తెగ పొగిడేస్తుంది.అయితే రెండేళ్ళ క్రితం తాను ఎంతో ఇష్టపడి కొన్ని ఒక మొక్క గురించి సోషల్ మీడియాలో పెట్టిన భాదాకరమైన పోస్ట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది….

ఆమె తెలిపిన వివరాల ప్రకారం.తాను ఈ సక్యులేంట్ మొక్కని రెండేళ్ళ క్రితం కొన్నానని, దానిని నా దగ్గర ఉన్న మొక్కలకంటే కూడా ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నానని, తన కిచెన్ లోని కిటికీ వద్దనే దానిని ఉంచి రోజు నీళ్ళు పోస్తానని తెలిపింది.అంతేకాదు ఆ మొక్కకి ఎవరు నీళ్ళు పోసినా, దానిని ఎవరైనా ముట్టుకున్నా సరే తట్టుకోలేనని ఎందుకంటె ఈ మొక్కని ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తున్నానని తెలిపింది.అయితే…

ఈరోజు తాను ఈ మొక్కని వేరే అందమైన కుండీలోకి మార్చాలని నీళ్ళు పోసి పీకి చూడగా అది ప్లాస్టిక్ మొక్క అని తేలడంతో ఖంగు తిన్నానని, మొక్కల విషయంలో తాను మోసపోవడం ఎంతో బాధని కలిగించిందని తెలిపింది.గడించిన రెండేళ్లుగా అది నిజమైన మొక్కగా భావించిన తాను గతం గుర్తు చేసుకుని బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.నెటిజన్లు మాత్రం ఆమె మనస్తత్వానికి నవ్వుతూ కామెంట్స్ చేస్తున్నారు.

.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test