అమెరికా మహిళ వింత ఫోటో షూట్...ఇదేం పైత్యంరా బాబు..!!

సహజంగా ఫోటో షూట్ అంటే పెళ్లి తరువాత వధూవరులు ప్రకృతి అందాల దగ్గరకి వెళ్లి ఫోటోలు తీసుకుంటారు.వాటిని ఎంతో పదిలంగా భద్ర పరుచుకుంటారు.

 American Woman Different Photo Shoot, America, American Women, Bedhani, Photo S-TeluguStop.com

మరి కొందరు పుట్టిన పిల్లలని అందంగా ముస్తాబు చేసి ఫోటో షూట్ చేయిస్తారు.ఈ మధ్య కాలంలో కొత్త జంటలు బురదలో పడుకుని, మట్టిలో దొల్లుతూ, పొలం పనులు చెస్తున్నట్టుగా ఫోటో షూట్ తీయించుకుంటున్నారు.

కానీ అమెరికాలోని ఓ మహిళా మాత్రం వీటన్నిటికి భిన్నంగా కొత్త రకం ఫోటో షూట్ పరిచయం చేసింది…దాంతో ఇప్పుడు అది కాస్తా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.

అమెరికాలోని టెక్సాస్ కి చెందిన భెధాని కరులాక్ బెకర్ అనే మహిళ భిన్నంగా ఆలోచన చేసింది.

పెళ్ళిళ్ళు కామన్, పిల్లలు పుట్టాకా ఫోటో షూట్ కామన్ కానీ గర్భంతో ఉండగా ఫోటో షూట్ ఎలా ఉంటుంది అని ఆలోచన చేసింది అంతేకాదు ఆచరణలో పెట్టింది.అయితే ఈ ఫోటో షూట్ కూడా ఎంతో భిన్నంగా ఏర్పాటు చేసింది.

ఇదే అసలు ట్విస్ట్ కొందరు అయితే పైత్యం అని కూడా అంటున్నారు.అదేంటంటే.

బెధాని గత కొంత కాలంగా తేనే తీగల పెంపకం చేస్తోంది.వాటితో తనకి విడదీయలేని అనుభందం ఉందని వాటిని ఎంతో ప్రేమిస్తానని ఆమె చెప్పుకొచ్చింది.ఈ ఫోటో షూట్ లో వాటిని కూడా భాగం చేయాలనే ఆలోచనతో ఆమె గర్భంపై తేనే టీగలు ఉంచుకుని ఫోటో షూట్ చేయించుకుంది. ఈ ఫోటోలని సోషల్ మీడియాలో పంచుకుంది కూడా.

అయితే ఈ ప్రయత్నం ఎవరూ చేయవద్దని ప్రాక్టీస్ లేకుండా చేస్తే ఎంతో ప్రమాదమని కూడా తెలిపింది.అంతేకాదు తనకి పుట్టబోయే బిడ్డలు ఈ ఫోటో చూసి తాము ఎంతో ధీరులమని భావించాలని కూడా తెలిపింది.

కానీ ఈ ఫోటో చూసిన నెటిజన్లు, నీకు ఇదేమి పైత్యం, బుద్దుందా అంటూ తిట్ల వర్షం కురిపిసుంటే కొందరు మాత్రం నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ పొగిడేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube