అమెరికా వర్సిటీ సంచలన సర్వే...మొదటి స్థానంలో అమెరికా, రెండవ స్థానంలో ఇండియా...

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పటికి తన ప్రభావం పలు దేశాలపై చూపిస్తూనే ఉంది.మొదటి వేవ్ లో అగ్ర రాజ్యం అమెరికాను అతలాకుతలం చేసిన కరోన లక్షల సంఖ్యలో ప్రజలు ప్రాణాల హరించింది, కోట్లాది మంది కరోన బారిన పడి ఇప్పటికి నరకాన్ని అనుభవిస్తున్నారు.

 American Varsity Sensational Survey  America In First Place, India In Second Pla-TeluguStop.com

ఇక రెండవ వేవ్ లో మహమ్మారి భారత్ పై తీవ్ర ప్రభావం చూపించింది.కరోనా వ్యాధి సోకిన వారు, మరణాల సంఖ్య ఒకింత ఆందోళనలు కలిగించాయి.

ఇక పలు దేశాలపై కరోనా ప్రభావం చూపించిన ఈ రెండు దేశాలతో పోల్చితే వాటిపై ప్రభావం తక్కువనే చెప్పాలి, ఇక థర్డ్ వేవ్ డెల్టా వేరియంట్ మళ్ళీ అమెరికా పై విజ్రుంభించడంతో తీవ్రంగా ప్రాణ నష్టం వాటిల్లింది.

తాజాగా అమెరికా జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ చేసిన సర్వేలో సంచలన విషయాలు బయటపెట్టింది.

అమెరికాలో కరోన పరిస్థితులపై, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తూ సర్వే చేపట్టిన సదరు వర్సిటీ తన సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడించింది.ప్రపపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల సంఖ్య 23.72 కోట్లకు చేరుకుందని తెలిపింది అలాగే కరోనాతో చనిపోయిన వారి సంఖ్య రెండు రోజుల క్రితమే 50 లక్షలకు చేరుకుందని ప్రకటించింది.కరోనా మొదటి రెండవ వేవ్ లతో పోల్చితే ప్రస్తుతం కరోనా కేసులు, మరణాల సంఖ్య తక్కువగా ఉందని తెలిపింది.

Telugu America, Americanvarsity, Corona, Delta, India, India Place, Johns Hopkin

ఇదిలాఉంటే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 644 కోట్ల మంది వ్యాక్సిన్ వేసుకున్నారని, మరింత మంది వ్యక్సిన్వ్ వేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.ఇక అగ్ర రాజ్యం అమెరికా కరోనా మరణాలు, కరోనా సోకినా దేశాలలో మొదటి స్థానంలో నిలిచిందని ప్రకటించింది.4.44 కోట్ల మందికి కరోనా పాజిటివ్ రాగా మరణాల సంఖ్య 7.12 లక్షల మంది మృత్యువాత పడ్డారని, అమెరికా తరువాత స్థానంలో భారత్ నిలిచిందని 3.39 కోట్ల మంది కరోనా బారిన పడ్డారని ప్రకటించింది.ఆ తరువాతి స్థానాలలో బ్రిటన్, బ్రెజిల్, రష్యాలు ఉన్నాయని వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube