క్రెడిట్ కార్డ్ లతో కోట్లు సంపాదిస్తున్న అమెరికన్...ఎలా అంటే..!!

క్రెడిట్ కార్డ్స్ ద్వారా కోట్లు సంపాదించడం ఏంటి వాటి వల్ల జేబులకు చిల్లులు పడుతున్నాయి కదా అనుకుంటున్నారా.కానీ ఇది నిజం అమెరికాకు చెందిన ఓ యువకుడు కేవలం క్రెడిట్ కార్డ్ లు వాడుతూ కోట్లు వెనకేసుకున్నాడు.

 American Earned 3lakh Dollars With Credit Card, Credit Card Reward Points, Ameri-TeluguStop.com

ఖాళీగా ఉంటూ పని పాట లేని ఈ కుర్రాడికి ఇన్నేసి డబ్బులు ఎలా వస్తున్నాయని అనుమానం వచ్చిన చుట్టుపక్కల వాళ్ళు ఇన్కంటాక్స్ వారికి ఫిర్యాదు చేశారు.దాంతో అతడిని అదుపులోకి తీసుకుని డబ్బులు ఎలా వస్తున్నాయి అని అడిగిన అధికారులు అతడు చెప్పిన విషయం విని షాక్ అయ్యి షేక్ అయ్యారు…ఇంతకీ అతడికి డబ్బులు ఎలా వస్తున్నాయంటే….

క్రెడిట్ కార్డ్స్ వినియోగించే వారు సహజంగా కాష్ బ్యాక్ , రివార్డ్ పాయింట్స్ వస్తాయని ఉపయోగిస్తూ ఉంటారు.ఈ రివార్డ్స్ పాయింట్స్ ద్వారా లాభపడే వాళ్ళు కూడా ఉంటారు అయితే అది కేవలం వేలల్లో ఉంటుంది.

కానీ అమెరికాకు చెందిన “కాన్ స్టాంటీన్” అనే వ్యక్తికి క్రెడిట్ కార్డ్ ద్వారా వచ్చే రివార్డ్స్ పాయింట్స్ పై ఆసక్తి పెరిగింది.దీనిపై డబ్బులు ఎలా సంపాదించాలని అనే ఆలోచనతో ఫిజిసిస్ట్ గా ఉన్న వాడల్లా ఎలాంటి పనిచేయకుండా కేవలం రివార్డ్ పాయింట్స్ ద్వారా డబ్బు సంపాదించాలని భావించాడు.

క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్ ద్వారా వచ్చే సంపాదనపై దృష్టి పెట్టిన అతడు దీన్నే వృత్తిగా 2009 నుంచీ మొదలు పెట్టాడు.ఇంతకీ కొట్లలో డబ్బు ఎలా సంపాదించాడంటే

Telugu American, Americandollars, Credit, Credit Reward, Nri-Telugu NRI

1000 డాలర్ల గిఫ్ట్ కార్డ్ కొనుగోలు చేస్తే దాని మీద అతడికి 50 డాలర్లు రివార్డ్ అందేది.దీన్ని మళ్ళీ క్యాష్ చేసుకోవాలంటే 12 డాలర్లు చెల్లించాలి అంటే అతడి వద్ద 38 డాలర్లు ఉంటాయి ఇవి అతడికి లాభం, కేవలం ఇలా కొనుగోలు చేయడం రివార్డ్ లు పొందటం ద్వారా అతడు మొత్తం ౩ లక్షల డాలర్లు పైగానే సంపాదించాడు.ఈ మొత్తం దాదాపు 2.20 కోట్ల పైమాటేనట.ఈ విషయం అధికారులు తెలుసుకుని షాక్ అయ్యారట.

ఈ విషయం కాస్తా వైరల్ అవడంతో నెటిజన్లు మాత్రం అతడి తెలివి తేటలకు హ్యాట్సాఫ్ చెప్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube