ఆ దొంగలకి భారత సంతతి అమెరికన్లు టార్గెట్..ఎందుకంటే...??   American Thieves Targeting To Indian NRI     2018-10-13   12:14:22  IST  Surya

గత కొంతకాలంగా అమెరికాలో ప్రధానంగా భారత సంతతి వ్యక్తుల ఇళ్ళలో దొంగతనాలు జరుగుతూ వస్తున్నాయి. కేవలం భారతీయ అమెరికన్లని ఈ దొంగలు టార్గెట్ చేస్తూ వస్తున్నారు..అంతేకాదు వారి దగ్గర ఉండే విలువైన ఆభరణాలని టార్గెట్ చేస్తున్నారు.. ఎందుకనంటే వారి దగ్గర విలువైన ఆభరణాలు ఉంటాయని వారి నమ్మకమట.

అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఓ హోటల్‌ నిర్వహిస్తున్న భారతీయ అమెరికన్‌ కుటుంబం ఇంట్లో కొంత కాలం క్రితం ఓ భారీ దోపిడీ జరిగింది. గుర్తు తెలియని దొంగలు తమ విలువైన ఆభరణాలు ఎత్తుకుపోయారని, దీని పట్ల అప్రమత్తంగా ఉండేట్లు హెచ్చరించాలని అక్కడి పోలీసులకు వెల్లడించారు..అదేవిధంగా నార్‌వాక్‌ ప్రాంతంలోని భారత సంతతి అమెరికన్‌ కుటుంబానికి చెందిన ఇంట్లో రూ.14.72 లక్షల విలువైన ఇత్తడి ఆభరణాలు చోరీకి గురైనట్లు తమ నిఘాలో ఉన్న ఓ వీడియోను నార్‌వాక్‌ పోలీస్‌ విభాగం షేర్‌ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

American Thieves Targeting To Indian NRI-

అయితే ఈ క్రమంలో దొంగలు ఉపయోగించిన వాహనాన్ని నగరం వెలుపల స్వాధీనం చేసుకున్నారని, దాని లైసెన్స్‌ ప్లేట్‌ తొలగించి, వేలిముద్రలు కనిపించకుండా ఉండేలా చేశారని తెలిపింది..భారతీయ అమెరికన్లు తమ ఆచారాలు, సంస్కృతికి అనుగుణంగా విలువైన ఆభరణాలు కలిగి ఉంటారనే భావనతో వారిని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరుగుతున్నాయని ఓ పోలీసు ఉన్నత అధికారి తెలిపారు..