అమెరికా దొంగల రూటే సపరేటు..ఈ కామర్స్ దిగ్గజాలకు చుక్కలే...!!

దొంగతనాల యందు అమెరికాదొంగ, దొంగతనాలు వేరయా.వీరి తెలివి చూస్తే మైండ్ బ్లోయింగ్ రా మామా అంటూ తాజాగా ఎక్కడ చూసిన ఈ అమెరికా దొంగల గురించే చర్చ జరుగుతోంది.

 American Thieves' Route Different For These E-commerce Giants , America, E-comm-TeluguStop.com

కొట్టేయడంలో కూడా తమ రూటే సపరేటు అంటూ ఎంతో చాకచక్యంగా దొంగతనాలు చేస్తూ ఈ కామర్స్ దిగ్గజాలకు చుక్కలు చూపుతూ, కొట్లలో భారీ నష్టాలు వచ్చే స్థాయిలో దొంగతనాలు చేస్తున్నారు.ఇంతకీ వాళ్ళు దొంగతనాలు ఎలా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు.

అంతగా వాళ్ళ గురించి ఎందుకు చర్చించుకోవాల్సి వస్తోంది అనే వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో లాస్ ఏంజిల్స్ లో దొంగలు తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నారు.

రైళ్ళపై దాడులు చేస్తూ అందులో ఉండే పార్సిల్స్ ను దొంగతనం చేస్తున్నారు.ఈ కామర్స్ సంస్థలలో వినియోగదారులు వస్తువులను ఆర్డర్ చేసిన తరువాత వాటిని ఓ గూడ్స్ రైలు లో భద్రంగా తరలిస్తున్న క్రమంలో దొంగలు బండి ఆగే ప్రాంతాలలో మాటు వేసి రైలులోకి ప్రవేశించి విలువైన పార్సిల్స్ అన్నీ బయటకు తీస్తున్నారని, వారికి నచ్చిన వస్తువులను మాత్రమే తీసుకువెళ్ళి, నచ్చని వస్తువులు, చిన్న చిన్న వస్తువులను పట్టాలపై పడేస్తున్నారని స్థానిక పోలీసులు తెలిపారు.లాస్ ఏంజిల్స్ లో ఓ ప్రాంతంలో అయితే పట్టాలపై గుట్టలు గుట్టలుగా ఖాళీ పార్సిల్ పడి ఉంటాయట.

2020 నుంచీ ఈ తరహా దొంగతనాలు జరుగుతున్నాయని అప్పట్లో ఈ దొంగతనాల శాతం 150 ఉండగా 2021 నాటికి 350 శాతం దొంగతనాలు నమోదయ్యాయని అధికారులు అంటున్నారు.వీరు ఎక్కువగా క్రిస్మస్ సమయంలో భారీ స్థాయిలో దొంగతనాలకు పాల్పడుతున్నారని, ఆ సమయంలో అమెరికా ప్రజలు పెద్ద సంఖ్యలో కొనుగోళ్ళు చేయడమే అందుకు కారణమని అంటున్నారు అధికారులు.అయితే చాకచక్యంగా దొంగలను పట్టుకుంటున్నా కోర్టులలో వారికి కటినమైన శిక్షలు పడకపోవడం వలన వెంటనే బయటకు వచ్చేస్తున్నారని ఈ కామర్స్ దిగ్గజాలు గొల్లుమంటున్నాయి.ఇదిలా ఉంటే 2021 లో ఈ కామర్స్ దిగ్గజాలు దొంగతనాల వలన నష్టపోయిన మొత్తం రూ.38కోట్లని అధికారులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube