పాండా ని సన్మానించిన భారతీయ సంఘాలు..

ఓ ఎన్నారై సాధించిన ఉన్నత పదవికి.తోటి ఎన్నారైలు అందరూ కలిసి ఓ సత్కార సభని ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు.

శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సులేట్‌ జనరల్ గా భాద్యతలని చేపట్టిన సంజయ్ పాండా ని ఎఐఎ ( అసోసియేషన్ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌) ఎంతో మర్యాద పూర్వకంగా సత్కరించుకున్నారు.ఈ కార్యక్రమానికి బే ఏరియాలో ఉన్న దాదాపు 30 సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

ముందుగా జనగణమన జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎన్నారైలు.ఆ తరువాత సంజయ్‌ పాండా దంపతులను వేదికపై సగౌరవంగా ఆహ్వానించారు.కేవలం ఎఐఎ ప్రతినిధులు మాత్రమే కాకుండా వివిధ సంఘాలకు చెందిన ప్రముఖులు వేదికపైకి వచ్చి కాన్సల్‌ జనరల్‌కు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా సంజయ్‌ పాండా మాట్లాడుతూ.

Advertisement

కమ్యూనిటీకి సేవ చేస్తున్న ఎఐఎను, సంఘాలు అన్నిటిని ఆయన అభినందించారు.విదేశంలో ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతిని కాపాడుతున్న మీరు రేపటి తరానికి ఆదర్శంగా ఉండాలని.భారతీయత భావి తరాలకి అందించాలని ఆయన కోరారు.

Advertisement