అమెరికాలో టొర్నాడోల దాడి...భాదితులకు తెలుగు సంఘం 'ఆటా' భారీ సాయం..

అమెరికా ప్రజలకు కరోనా మహమ్మారి కంటి మీద కునుకు ఉండనివ్వడంలేదు.ఎటు చూసిన భారీ స్థాయిలో కేసులు నమోదవడంతో లాక్ డౌన్ విధిస్తే ఎక్కడ మళ్ళీ తమ జీవితాలు వీధిన పడుతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమెరికన్స్.

 American Telugu Association Fund Raises Tornado Effect In Us,ata,american Telugu-TeluguStop.com

ఈ క్రమంలోనే అమెరికా ప్రజలు భయాందోళనలకు గురిచేసిన టొర్నాడోలు ఓ ప్రాంతం మొత్తాన్ని నేలమట్టం చేశాయి.ఒక పక్క కరోనా తో నానా ఇబ్బందులు పడుతున్న అమెరికన్స్ కు మరో పక్క టొర్నడోలు చేస్తున్న దాడులు తీవ్ర ఆర్ధిక నష్టాన్ని మిగిల్చాయి.

ఈ పరిస్థితుల నేపధ్యంలో ఆపదలో ఆపన్న హస్తం అందించే అమెరికా తెలుగు సంఘం (ఆటా ) టొర్నాడో వలన నష్టపోయిన వారికి భారీ సాయం అందించారు.

అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో ఆటా కు ప్రత్యేకమైన స్థానం ఉంది.

తెలుగు బాషాభివ్రుద్దికై, తెలుగు ఎన్నారైల సంక్షేమానికి, అలాగే తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సేవా చైతన్య కార్యక్రమాలు చేపట్టేందుకు ఆటా చేసే కృషి అంతాయింతా కాదు.ముఖ్యంగా తెలుగు వారికి మాత్రమే కాకుండా అమెరికాలో పేదలకు, నిరాశ్రయుల కోసం ఆటా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉంటుంది.

ఈ కారణంగానే అమెరికన్స్ ఆటా సంస్థపై అభిమానం చూపిస్తూ ఉంటారు.తాజాగా టొర్నడోల వలన వీధిన పడిన కెంటకీ వాసుల ఆటా సభ్యులు ఏకమై విరాళాలు సేకరించారు.

భాదితులను ఆదుకోవాలంటూ ఆటా సంస్థ సభ్యులు సన్నీ రెడ్డి ఇచ్చిన పిలుపుతో కదిలిన మిగతా సభ్యులు 25 వేల డాలర్లు సేకరించారు.ఈ మొత్తాన్ని మిగిలిన సభ్యులు కిరణ్ , సుదీర్, చల్లా రవి ఆటా అధ్యక్షుడు భువనేష్ లతో కలిసి వాషింగ్టన్ డీసి లో ఉన్న రెడ్ క్రాస్ ప్రధాన కార్యాలయంలో చెక్కును అందించారు.

ఆటా చేసిన ఈ భారీ సాయానికి రెడ్ క్రాస్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేసారు.

American Telugu Association Fund Raising for Tornado Victims

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube