వైరల్ వీడియో - అమెరికా యువకులు...రోడ్డు నడిమధ్యలో..

ఎక్కడికైనా మనం వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మనం ఏమి చేస్తాం, ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకూ వెయిట్ చేస్తాం.ఇంకొంచం సేపు ట్రాఫిక్ కదలకుంటే అసలు ఎందుకు ఈ ట్రాఫిక్ జామ్ అయ్యిందో అంటూ ఆలోచన చేస్తాం.

 American Teenagers Road-TeluguStop.com

ఇక చేసేది లేక ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకూ ఊసురోమని కూర్చుంటాం.కానీ అమెరికాలో ఓ ముగ్గురు యువకులు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించారు…దాంతో అది కాస్తా వైరల్ అయ్యి నేట్టింట్లో హల్చల్ చేస్తోంది.

మరి ఆ యువకులు ఏమి చేశారో మీరు ఓ లుక్కేయండి.

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ముగ్గురు యువకులు రోడ్డు నడిమధ్యలో అది కూడా భారీగా ట్రాఫిక్ ఉండే ప్రాంతంలో బల్ల , స్టూల్స్ వేసుకుని పేకాట ఆడుతున్న వీడియో హల్చల్ చేసింది.అదేంటి వీళ్ళకి ఏమి పోయేకాలం అంటూ అందరూ తిట్టుకున్నారు.కానీ వాళ్ళు చేసిన పని తెలుసుకుని మళ్ళీ అందరూ మెచ్చుకున్నారు.

రోడ్డు మధ్యలో గేమ్స్ ఆడుతుంటే మేచ్చేకోవడం ఏంటి

ఆ యువకులు ముగ్గురు రోడ్డు మధ్యలో కార్డ్ ఆడటానికి కారణం ఏమిటంటే.ఫ్లోరిడా లో ఏ సిగ్నల్ దగ్గర ఆడినా నిమిషాల పాటు వాహనాలు కదలడం లేదట.

రెడ్ సిగ్నల్ పడితే మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడటానికి చాలా సమయం పడుతోందని ఈ పరిస్థితితో అసలు ప్రయాణం చేయాలంటే చికాకు తెప్పిస్తోందని అంటున్నారు.అంతేకాదు అత్యవసర పరిస్థితి అయిన ఇక వారి పని అంతే అంటున్నారు ఆ యువకులు.

అందుకే ప్రభుత్వంలో మార్పు రావాలని తాము ఇలా సిగ్నల్ పడగానే రోడ్డుపై కార్డ్స్ ఆడుతున్నామని అంటున్నారు.

ఈ విషయంపై స్పందించిన ట్రాఫిక్ పోలీసులు, ప్రయాణికుల బాధని తెలిపేలా వారు చేసిన పని అర్థమయ్యిందని త్వరలో ఈ సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube