స్టూడెంట్స్ ఇచ్చిన గిఫ్ట్...బోరున ఏడ్చినా టీచర్...!!!

విద్యార్ధులకి, టీచర్స్ కి మధ్య ఉన్న సంభంధం మాటల్లో చెప్పలేనిది.ఒక విద్యార్ధిని గాడిలో పెట్టాలి, ఉన్నతమైన వ్యక్తిగా తీర్చి దిద్దాలి అంటే అందుకోసం టీచర్స్ పడే తపన అంతాఇంతా కాదు.

 American Students Unexpected Gift To Teacher-TeluguStop.com

విద్యార్ధులు కూడా తల్లి తండ్రుల వద్దకంటే కూడా అధిక సమయంలో స్కూల్ లో టీచర్స్ మధ్యనే గడుపుతూ ఉంటారు.తమకి చదువు చెప్పడానికి స్కూల్ లో ఎంతో మంది విద్యార్ధులు ఉన్నా ఒకే టీచర్ పై మాత్రం ప్రేమాభిమానాలు కురిపిస్తుంటారు, వారితో ఉండే రిలేషన్ ఇంట్లో వారితో సమానంగా ఉంటుంది…అయితే

Telugu America, Americangift, Gift, Shoe, Telugu Nri-

అమెరికాలో ఓ టీచర్ కి , స్టూడెంట్స్ కి మధ్య జరిగిన ఓ సన్నివేశాన్ని చిత్రీకరించిన పిల్లలు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యి అందరిని కంటతడి పెట్టించింది.స్టూడెంట్స్ అందరూ కలిసి ఇచ్చిన గిఫ్ట్ చూసిన ఆ టీచర్ బోరున ఏడ్చేశాడు.ఇంతకీ పిల్లలు ఏమి గిఫ్ట్ ఇచ్చారు.

అది చూసిన టీచర్ ఎందుకు ఏడ్చాడు అనే వివరాలలోకి వెళ్తే.ఆ స్టూడెంట్స్ కి తమ టీచర్ పై ఎంత ప్రేమ ఉండే తెలుస్తుంది.

అమెరికాలోని వాషింగ్టన్ లోని బెల్వ్యూ ఉన్న లోగాన్ ఫాంటెనెల్ స్కూల్ లో ట్రే పెన్ అనే వ్యక్తి టీచర్ గా పనిచేస్తున్నాడు.పిల్లలకి చదువు చెప్పడంలో అతడి ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

అందుకే పిల్లలకి అతడికి ఆ స్కూల్ లో మంచి రిలేషన్ ఉంటుంది.అయితే కొన్ని రోజుల క్రితం అతడి షూ కనపడలేదు.

దాంతో అతడు మరో షూ కొనకుండా చెప్పులతో రావడం చూసిన స్టూడెంట్స్ తమ వద్దనున్న పాకెట్ మనీ సేకరించి తమ టీచర్ కి కొత్త షూ కొన్నారు.విద్యార్ధులు ఎదో గిఫ్ట్ ఇచ్చారని చూసిన అతడు బహుమతి తీసి చూడగానే కొత్త షూ కనపడటంతో బోరున విలపించాడు.

స్టూడెంట్స్ ఇచ్చిన ఈ గిఫ్ట్ జీవితాంతం గుర్తు ఉంటుందని ట్రే సంతోషం వ్యక్తం చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube