శరణార్ధుల చిన్నారుల మృత్యు వాత..!!!

అమెరికాలోని వాషింగ్టన్ లో చిన్నారుల పట్ల అమెరికా అవలంబిస్తున్న విధానాలు చిన్నారుల నిండు ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి.అమెరికా సరిహద్దుల్లోని శరణార్థుల నిర్బంధ కేంద్రంలో గురువారం మృతి చెందిన చిన్నారి తో కలిపి ఇప్పటికి ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.

 American Soldiers Indecent Behavior On Migration Childrens-TeluguStop.com

ఇతర దేశాల నుంచి ఆశ్రయం కోసం వస్తున్న శరణార్ధుల పట్ల అమెరికా ప్రభుత్వ సరిహద్దు ప్రత్యేక భద్రతా దళాలు కర్కశంగా ప్రవర్తిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ధ్రువీకరణ పత్రాలు లేని వారిని తనిఖీ పేరుతో వేధిస్తున్నారని తెలుస్తోంది

శరణార్ధుల చిన్నారుల మృత్యు వ�

అంతేకాదు సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వారిని సరిహద్దు నుంచి వెనక్కి పంపుతున్నాయి.ఎలాంటి పత్రాలు లేని వారిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారు.శరణార్థుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేసి ప్రత్యేక గదుల్లో ఉంచుతున్నారు.

గతంలో కుమార్తె ఇవాంకా కూడా చిన్నారులను తల్లిదండ్రుల నుంచి వేరు చేయొద్దని కోరారు అయితే సరిహద్దు భద్రతా దళాల తీరు మాత్రం మారడం లేదు

మరో పక్క అక్రమ నిర్బంధంలో ఉన్న చిన్నారులు మానసికంగా కుంగిపోతున్నారు.తల్లిదండ్రుల నుంచి దూరం కావడంతో వారి బాధ మరింతగా ఎక్కువ అవడంతో ,వివిధ వ్యాధిల బారినపడి ,అకాలమరణం చెందుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

గ్వాటిమాలాకి చెందినా కార్లోస్ ఫెర్నాండెస్ అనే చిన్నారి తాజాగా మృతి చెందింది.చిన్నారులని నిర్బంధించి గదిలో ఉండే ప్రదేశాలలో పెట్టడం అక్కడ గాలి ఆడకపోవడంతో చిన్నారులు మృతి చెందుతున్నారని హక్కుల నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube