125 ఏళ్ల క్రితం తొలి అడుగు: తమ మూలాలపై అమెరికన్ సిక్కు సమాజం సర్వే

భారతదేశం నుంచి వివిధ దేశాలకు వెళ్లి స్థిరపడిన వారిలో సిక్కులు ముందు వరుసలో ఉంటారు.దేశానికి స్వాతంత్రం రావడానికి ముందే చాలా మంది ఇతర దేశాలకు వలస వెళ్లారు.

 American Sikh Group Begins Survey To Develop Dataset Of Community In Us, Saldef,-TeluguStop.com

అమెరికా, కెనడా, యూకే, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలలో సిక్కు జనాభా పెద్ద సంఖ్యలో ఉన్నారు.ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (ఎస్ఏఎల్‌డీఈఎఫ్) మొట్టమొదటిసారిగా నేషనల్ సిక్కు అమెరికన్ సర్వేను ప్రారంభించింది.

తద్వారా 125 సంవత్సరాల నుంచి అమెరికాలో స్ధిరపడ్డ సిక్కుల మూలాలను గుర్తించి డేటా రూపంలో భద్రపరచనుంది.సిక్కు అమెరికా సమాజానికి సంబంధించిన జనాభా, రాజకీయ అనుబంధం, సామాజిక సమస్యలపై అభిప్రాయాలు, వ్యక్తిగత అనుభవాలు తదితర వివరాలను సంగ్రహించేందుకు ఈ సర్వేను ప్రారంభించినట్లు ఈ సంస్థకు చెందిన గుజారీ సింగ్ తెలిపారు.

ఈ సర్వే పూర్తయిన తర్వాత సిక్కు సమాజం, పరిశోధకులు, విద్యా సంస్ధలు, ప్రభుత్వ, ప్రైవేట్ లాభాపేక్షలేని రంగానికి అందుబాటులో ఉండేలా వివరాలతో నివేదిక రూపొందిస్తామన్నారు.

Telugu Americansikh, Americans, Saldef, Sikh Community-

కాగా సిక్కులు 1890లలో మొట్టమొదటిసారిగా పసిఫిక్ నార్త్‌వెస్ట్‌లో ఉన్న కలప మిల్లుల్లో, కాలిఫోర్నియాలోని పొలాల్లో పనిచేయడానికి, అమెరికాను వివిధ ప్రాంతాలతో కలిపే రైలు మార్గాలను నిర్మించడానికి యూఎస్‌కు వచ్చారు.అమెరికాలో ప్రస్తుతం 7,00,000 మంది సిక్కులు ఉన్నట్లు ఒక అంచనా.

అమెరికాతో సుధీర్ఘ అనుబంధం, చరిత్ర ఉన్నప్పటికీ సిక్కు అమెరికన్లు ఇంకా వివక్షను ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా 9/11 ఉగ్రవాద దాడుల తర్వాత ఇది మరింత పెరిగింది.ఉదాహరణకు బల్బీర్ సింగ్ సోధీ తన కథనాల కారణంగా కాల్చి చంపబడ్డాడు.9/11 ద్వేషపూరిత నేరానికి అతను మొదటి బాధితుడు అయ్యాడు.అలాగే ఆగస్టు 5, 2012న విస్కాన్సిన్‌లో ఓక్‌క్రీక్‌లోని ఓ సిక్కు దేవాలయంపై జరిగిన దాడిలో ఆరుగురు భక్తులు మరణించారు.

SALDEF సర్వే డేటా సెట్ అమెరికా సిక్కు సమాజం యొక్క ఖచ్చితమైన ప్రొఫైల్‌ను అందిస్తుందన్ని ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ కౌర్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube