వైరల్: సమోసా దెబ్బకి అమెరికా యువకుడికి ఇండియా గుర్తొచ్చింది.. ఏమన్నాడో చూడండి!

సోషల్ మీడియా హవా ఏరీతిలో వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అది అందుబాటులోకి వచ్చిన తరువాత దేశ విదేశాల్లో ఏం జరుగుతోందో ఇట్టే తెలుసుకోగలుగుతున్నాం.

 American Shocked By High Prices Of Samosas In Us Restaurant Details, Viral, Vira-TeluguStop.com

అక్కడి ప్రజల జీవన విధానం, ఆహారం, ఆదాయం వివరాలు.ఇలా ఎలాంటి సమాచారం కావాలన్నా ఒక్క క్లిక్ తో తెలుసుకోగలుగుతున్నాం.

ప్రస్తుతం చాలా మంది కంటెంట్ క్రియేటర్లు తాము ఉంటున్న ప్రదేశాలకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారాన్ని తెలియజేస్తూ కాసులు సంపాదిస్తున్న పరిస్థితి వుంది.

ప్రస్తుతం అలాంటి వీడియోలకు మంచి గిరాకీ వుంది.అందుకే అలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓ యువకుడికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

అమెరికాకు( America ) చెందిన యువకుడు స్థానికంగా ఉన్న హోటల్‌కి వెళ్లి, అక్కడి సమోసా( Samosa ) ధరను చూసి అవాక్కయ్యాడు.దెబ్బకి ఇండియా( India ) గుర్తొచ్చి.

ఏమన్నాడో తెలిస్తే మీరు అవాక్కవుతారు.కావాలంటే ఇక్కడ వీడియో చూడండి.

ఆ వీడియోని ఒకసారి గమనిస్తే హోటల్ కి వెళ్లన యువకుడు అక్కడ ధరలకు సంబంధించిన పట్టిక చూడగానే ఆశ్చర్యపోతాడు.రెండు సమోసాలు కలిపి $7.49 (రూ.618.41) ధర ఉండడం చూసి షాక్ అవుతాడు.ఈ నేపథ్యంలో అతడు గతంలో తన స్నేహితులతో కలిసి బీహార్‌కు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు.బీహార్‌లో రెండు సమోసాలు కలిపి రూ.20మాత్రమే అని, పైగా ఎంతో టేస్టీగా ఉన్నాయని చెప్పుకొస్తూ.అదే అమెరికాలో మాత్రం 2 సమోసాలకు రూ.600లు వైనే వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.పైగా టేస్ట్ అంతంత మాత్రమేనని అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube