బిడెన్ అధ్యక్ష పదవిని కోల్పోక తప్పదా..?? వైట్ హౌస్ మాజీ ఫిజీషియన్ సంచలన వ్యాఖలు..!!

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ త్వరలో తన అధికారాన్ని విడిచిపెట్టాల్సిందేనా.?? బిడెన్ పై 25 వ అధికరణ ద్వారా పదవి నుంచీ తప్పించనున్నారా.?? అనారోగ్య సమస్యను చూపి ప్రభుత్వ పెద్దలు బిడెన్ ను పడక్కుర్చీ మేధావిగా చేయనున్నారా అంటే అవుననే అంటున్నారు నిపుణులు.ఆయన ఆరోగ్యం మెరుగ్గా లేదని, ఆయన ఆరోగ్యం పై అధ్యక్ష పదవి ప్రభావం చూపుతోందని, ఇది బిడెన్ ను రోజు రోజుకు అన్ఫిట్ అధ్యక్షుడిగా చేస్తోందని అంటున్నారు.

 American Senior Physician Ronny Jackson Sensational Comments On Joe Biden, Ameri-TeluguStop.com

ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు.ఈ వ్యాఖ్యలలో నిజమెంత అనే వివరాలలోకి వెళ్తే.

గడిచిన కొంత కాలంగా బిడెన్ ను పరిశీలిస్తే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని ఎవరైనా చెప్పేయచ్చని, అందుకు నిపుణులే అవసరం లేదని అంటున్నారు వైట్ హౌస్ మాజీ సీనియర్ ఫిజిషియన్ రోనీ జాక్సన్.ఆయన మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూ లు మొదలు, నడిచే తీరు అన్నీ అనుమానాలు కలిగించేలా ఉంటాయని రోనీ అంటున్నారు.

గతంలో విమానం ఎక్కుతూ పదేపదే మెట్లపై పడిపోయిన ఘటన అందరికి గుర్తు ఉండే ఉంటుందని, ఒక సారి పడిపోతే కాలు జారిందని భావించవచ్చని కానీ పదేపదే పడిపోవడం పైకి లేవలేక పోవడం దేనికి సంకేతమో అందరికి తెలుసు కదానని ఎద్దేవా చేశారు.అలాగే

Telugu Americansenior, Covid, Joe Biden-Telugu NRI

మీడియాకు ఇంటర్వ్యూ లు ఇచ్చే సమయంలో ఆయన తన సహచరులు, సిబ్బంది పేరులు కూడా మర్చిపోతూ ఉంటారనే విషయాన్ని గుర్తు చేశారు.విలేఖరులు అడిగిన ప్రశ్నలకు బదులు ఇవ్వకుండా ఏవేవో మాట్లాడుతున్నారని ఒక అధ్యక్షుడిగా ఆయన ఎలా ఉండాలో ఆయనే నిర్ధారించుకోవాలని సూచించారు.అధ్యక్ష పదవికి అర్హత ఉన్నంత కాలం వినియోగించుకునే పరిస్థితులు ఎక్కడా కనపడటం లేదని, ఆయనకు ఏదో అనారోగ్య సమస్య ఉందని ఆయన్ను 25వ అధికరణ ఉపయోగించి పదవి నుంచీ పక్కకు తప్పించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని జాక్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మనది అగ్ర రాజ్యమని, అలాంటిది దేశానికి సరైన నాయకుడు లేకపోతే అమెరికా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేమని హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube