అమెరికాలో పాపకి ఇండియా పేరు...!!!

అమెరికాలో అర్ధరాత్రి సమయంలో జరిగిన ఓ సంఘటన సంచలనం సృష్టించింది.పోలీసులు ఆర్ద్రాత్రి సమయంలో విధి నిర్వహణలో భాగంగా తిరుగుతున్నసమయంలో రోడ్డు పక్కాగా ఓ పాప ఏడుపు వినిపించింది.

 American Puts A Name To A Child As India-TeluguStop.com

ఈ సమయంలో స్థానికంగా పాప ఏడుపు ఏంటా అని చూసిన వారికి అప్పుడే పుట్టిన ఓ పాప ఏడుస్తూ ఓ బ్యాగ్గు లో చుట్టి కనిపించింది.దాంతో చుట్టుపక్కల ఈ పాప ఆచూకీ కోసం గాలించారు అయినా ఫలితం లేకపోవడంతో పాపని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అమెరికాలో పాపకి ఇండియా పేరు!!

ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం పాప గురించి మీడియాకి తెలిపారు.పాప తల్లి తండ్రుల కోసం వెతుకుతున్నామని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.తప్పకుండా పాపని తల్లి తండ్రుల దగ్గరకు చేర్చుతామని అన్నారు.ఈ క్రమంలోనే పాపకి పోలీసులు ఇండియా అనే పేరు పెట్టారు.పాప తల్లి తండ్రులని వెతికే క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాలలో డెలివరీకి దగ్గరపడింది మహిళల గురించి ఆరా తీస్తున్నారు.

ఇదిలాఉంటే పాపని కాపాడే క్రమంలో తీసిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

బేబీ ఇండియా అనే హాష్ ట్యాగ్ తో పాపకి తోచిన సాయం చేస్తున్నారు, పాపని ఇలా దయనీయంగా వదిలేసినా తల్లి పై నిప్పులు చెరుగుతున్నారు నెటిజన్లు.ఈ పాపని దత్తత తీసుకుంటామని చాలా మంది స్పందిస్తూ ఉండగా, ఆ పాప తల్లి తండ్రులు వచ్చినా ఎలాంటి స్పందనా తెలుపవద్దని, అసలు వారికి పాపని ఇవ్వవద్దని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube