రిపబ్లికన్ల పైనే వివక్షా సోషల్ మాధ్యమాలపై ట్రంప్ ఫైర్

రిపబ్లికన్ పార్టీ నేతలపై అమెరికాలో వివక్ష చూపిస్తోంది సోషల్ మీడియా అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైర్ అయ్యారు.అంతేకాదు మా నేతలపై వివక్ష చూపితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, కోర్టుకు ఈడ్చుతామని హెచ్చరికలు కూడా జారీ చేశారు.

 American President Donald Trump Warningto Socialmedia-TeluguStop.com

ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ట్రంప్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా ట్విట్టర్ ని ఉద్దేశించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్విట్టర్‌ తనకి చేసిన ద్రోహం మరీ దారుణమని వెల్లడించారు.తనకి లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారని అయితే ఇంకా చాలా మంది తనని అనుసరించాలని కోరుకుంటుంటే, ట్విట్టర్ వారిని నిలువరిస్తోందని, ట్విట్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో సారి అమెరికా అధ్యక్షుడిగా అవకుండా చేయడంలో ట్విట్టర్ ఈ రకమైన ప్రయత్నాలు చేస్తోందని, ఇది ఎంతవరకూ సమంజసం అంటూ మండిపడ్డారు.ట్విట్టర్ చూపిస్తున్న ఈ వివక్షతో వారిపై న్యాయపోరాటం చేయాలని భావిస్తున్నట్టుగా ట్రంప్ తెలిపారు.

రిపబ్లికన్ల పైనే వివక్షా సోష�

ఇదిలాఉంటే అమెరికన్ కాంగ్రెస్ గూగుల్ ,యాపిల్ ,అమెజాన్ తదితర టెక్నాలజీ సంస్థల్ని హెచ్చరించింది.అన్ని సంస్థలు పోటీని తగ్గించి వినియోగ దారులకి లబ్ది చేకూర్చేలా ఉండాలని స్పష్టం చేసింది.ఇప్పటికే ఈ రకమైన విషయాలపై దర్యాప్తు జరుగుతోందని తెలిపింది.అయితే ఈ ఆరోపణలపై స్పందించిన గూగుల్ ప్రతినిధి తమ నుంచీ ఎటువంటి రాజకీయ వివక్షకూ తావు ఉండదని, ఎప్పడూ ఎవరికీ మద్దతు మేము తెలుపలేదు, తెలుపుము అంటూ స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube