అమెరికా పోలీసులు యువకుడు పై రాక్షస దాడి..

అమెరికాలో పోలీసులు అనవసరంగా యువకులపై రాక్షసి దాడికి పాల్పడుతూ ఉంటారు.తాజాగా అమెరికా పోలీసుల తీరు మరోసారి తీవ్ర వివాదాస్పదంగా మారింది.

 American Police Brutal Attack On Young Man , American, Police Brutal Attack, Int-TeluguStop.com

మెంఫిస్‌ నగరంలో ఈనెల మొదటి వారంలో టైర్ నికోల్స్‌ అనే యువకుడి పై కొంత మంది పోలీసులు అమానుషంగా దాడి చేయడంతో అతడు చనిపోయాడు.మృతుడు, దాడి చేసిన పోలీసులు నల్లజాతీయులే.

దాడికి సంబంధించిన పూర్తి ఫుటేజ్ ను అధికారిక వర్గాలు విడుదల చేశాయి.

Telugu America, Americanattack, International, Memphis, Joe Biden, Tire Nichols-

ఇందులోని దృశ్యాలు హృదయవిదారకంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడనే కారణం తోనే మెంఫిస్‌ నగర పోలీసులు టైర్ నికోల్స్‌ ను ఆపినట్లు మొదట వార్తలు వచ్చాయి.తాజాగా విడుదలైన వీడియోలో అలా లేదు.

తను ఏ తప్పు చేయలేదని చెప్తున్నాప్పటికీ పోలీసులు నిర్దయగా వ్యవహరించడం కనిపిస్తుంది.ముందుగా అతడిని కారులోంచి బయటకు లాగారు.

చేతులు విరగొట్టామని ఒక పోలీసు ఆదేశించగా అతని రోడ్డుపై కళ్లతో తొక్కి పెట్టడం కనిపిస్తుంది.

Telugu America, Americanattack, International, Memphis, Joe Biden, Tire Nichols-

బాధితుడు వారి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన అతన్ని వెంబడించి పోలీసులు పట్టుబడిన వెంటనే ఎలాంటి కనికరం లేకుండా చాలా సేపు ముష్టి ఘాతాలు కురిపించారు.అతను బాధతో విలవిలలాడుతూ వదిలేయమని ప్రాధేయా పడడం వీడియోలో కనిపిస్తుంది.ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఈ నెల 7న ఈ ఘటన జరగగా చికిత్స పొందుతు నికోల్స్‌ ఈ నెల పదవ తేదీన మృతి చెందాడు.ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు పోలీసులపై సెకండ్ డిగ్రీ హత్యా నేరం కింద అభియోగాలు మోపారు.

నికోల్స్‌ మృతి పట్ల అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఈ దారుణాన్ని నిరసిస్తూ దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో శుక్రవారం శాంతియుత ప్రదర్శనలు జరిగాయి.

మెంఫిస్‌ నగరం మొత్తం స్తంభించిపోయింది.ఈ నగరంలోని పాఠశాలలు, క్రీడా పోటీలు, వ్యాపార సమావేశాలు రద్దు అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube