అమెరికాలో వెలుగు చూసిన మరో ఘోరం..ఇదెంతో దారుణం..!!

అమెరికాలో నల్లజాతీయుల హత్యల విషయంలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి.జార్జ్ ఫ్లాయిడ్ హత్య ఉదంతం ఎంతటి ఉద్రిక్త పరిస్థితులకి దారితీసిందో అందరికి తెలిసిందే.

 American Police Officers Killed Another Black Man Daniel Prude,black Man, Trump-TeluguStop.com

ఈ ఘటనతోనే ట్రంప్ పై నల్లజాతీయుల వ్యతిరేక నినాదాలు ఊపందుకున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.

ట్రంప్ పై జాత్యహంకారి అనే బలమైన ముద్రని వేశాయి.అయితే జార్జ్ ఫ్లాయిడ్ హత్య ఘటన కంటే రెండు నెలల ముందు మరొక దారుణమైన ఘటన జరిగిందని తాజాగా వెలుగులోకి వచ్చింది.

న్యూయార్క్ లోని రోచెస్టర్ నగరంలో నల్లజాతీయుడైన ఓ మానసిక వికలాంగుడిపై పోలీసులు చూపించిన జాత్యహంకార ప్రతాపానికి డానియల్ అనే 41 ఏళ్ళ వ్యక్తి మరణించాడు.డానియల్ తన కుటుంభంతో కలిసి చికాగో వెళ్ళాడు.

అదే సమయంలో అతడు కుటుంభం నుంచి తప్పిపోయాడు.ఈ ఘటనతో పోలీసులకి సమాచారం ఇచ్చిన కుటుంభ సభ్యులు తాము కూడా డానియల్ ని వెతకసాగారు.

ఈ క్రమంలోనే ఒంటిపై సరిగా బట్టలు లేని డానియల్ ని పోలీసులు పట్టుకుని చేతులు వెనక్కి కట్టేశారు.మానసిక వికలాంగుడు అనే కనికరం లేకుండా అతడి చేతులు వెనక్కి కట్టేసి తలని నేలపై అదిమిపెట్టారు.

నన్ను వదిలేయండి అంటూ డానియల్ వేడుకుంటున్నా వదలకుండా అతడి నోటి నుంచీ లాలాజలం వస్తోందని నోటికి దొంగలకి చుట్టే కవర్ ని చుట్టారు.ఈ చర్యలతో కంగారుపడిన డానియల్ వదిలేయమని కేకలు వేయడంతో కోపం వచ్చిన పోలీసులు అతడిని కిందకి పడేసి మెడపై మోకాలితో నొక్కి పెట్టారు.

ఈ పరిణామాలతో అతడు ఒక్క సారిగా ఊపిరి ఆడకుండా ఉండిపోవడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.కొన్ని రోజుల తరువాత డానియల్ మృతి చెందారని, అయితే బలమైన గాయాలతో ఊపిరి ఆడక పోవడం వలనే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

ఇప్పటికీ ఈ కేసు స్థానిక కోర్టులో విచారణలో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube