ఆరేళ్ళ పాపని అరెస్ట్ చేసిన అమెరికా పోలీసులు..ఎందుకంటే..!!!  

American Police Arrest Six Years Baby - Telugu America Florida Oland City, American Police, Six Yaars Baby Photos Wiral, Six Years Babu Arrested Take The Custody

చిన్నపిల్లలు అల్లరి చేయడం సహజం.కొంతమంది పిల్లల్లో పెద్దవాళ్ళను ఎదిరించే లక్షణాలను చూస్తుంటాం.

American Police Arrest Six Years Baby

ఇంట్లో తల్లితండ్రులతోనైన, స్కూల్ లో ఉపాధ్యాయులోతోనైన కొచెం దురుసుగా ప్రవర్తిచే స్వభావం కలిగిన పిల్లలు కూడా ఉంటారు.అలాంటప్పుడు అర్ధమయ్యే విధంగా చెప్పి చూడాలి,అప్పటికి మాట వినకపోతే మందలించాలి, అంతేకాని ప్రవర్తన నచ్చలేదని ఎవరినా పిల్లల్ని అరెస్ట్ చేయిస్తారా? అందులోనూ ఆరేళ్ళ పాప.? ఇదే ఘటన అమెరికాలో చోటు చేసుకుంది… వివరాల్లోకి వెళితే.

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓర్లాండ్ పట్టణాలో ఉన్న ఓ పాఠశాలలో అదే ప్రాంతానికి చెందిన ఓ ఆరేళ్ళ పాప చదువుతోంది.అయితే,ఆ అమ్మాయి ఉపాధ్యాయులతో అనుచితంగా ప్రవర్తించిందట.ఈ కారణంతోనే ఆ పాఠశాల యాజమాన్యం ఆ పాపపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో, హుటాహుటిన వచ్చిన పోలీసులు ఆ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఆరేళ్ళ చిన్నారి చేతికి సంకెళ్ళు వేసి తీసుకెళ్ళారు.ఆ సమయంలో.

ఆ చిన్నారి ఏడుస్తూ, ఇంకెప్పుడు ఇలా అనుచితంగా ప్రవర్తించనని, తనని అరెస్ట్ చేయొద్దని ప్రాధేయపడింది.కాని వారు ఏ మాత్రం కనికరం చూపించకుండా పాపను స్టేషన్ కు తీసుకువెళ్ళారు.

కాగా.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉంటే, ఆ పాప నల్ల జాతీయురాలు అవడం వలనే, పోలీసులు ఇలా ప్రవర్తిచారని నెటిజెన్లు కామెంట్లు పెట్టారు.దీనంతటికి స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు పాపను అరెస్ట్ చేసిన వారిని సస్పెండ్ చేశారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test