అమెరికా 181 ఏళ్ల నిభందనకి బ్రేక్..??

అమెరికాలో గత 181 ఏళ్లుగా ఉన్న రికార్డు ని బ్రేక్ చేశారు ముస్లిం మహిళలు.మతాల విలువలకి చోటు ఇస్తూ ప్రతినిధుల సభ వారి వారి ఆచారాల ప్రకారం ఒక బిల్లుని రూపొందించింది.

 American Muscle Womens Record Break In America-TeluguStop.com

ఆ బిల్లుకు అనుగుణంగానే హౌజ్‌కు తొలిసారిగా ఎన్నికైన తొలి ముస్లిం మహిళలు తమ మత సాంప్రదాయాలకి అనుగుణంగా తల పాగాలు ధరించి రికార్డు సృష్టించారు.

రషీదా త్లాయిబ్‌, ఇల్హాన్‌ ఒమర్‌ ఈ ఇద్దరు మహిళలు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ బిల్లు ఆమోదం పొందడం మరొక విశేషం.“హెడ్‌గేర్‌” పెట్టుకోవడం పై గత 181 ఏండ్లుగా ఉన్న నిషేధాననికి ఈ బిల్లుతో స్వస్తి పలికినట్టు అయ్యింది.గతేడాది నవంబరులో జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 100 మంది మహిళలు దిగువ సభకు ఎన్నికై చరిత్ర సృష్టించారు.

అయితే వీరిలో దాదాపు 28 మంది తొలిసారిగా ఈ ప్రతినిధుల సభలో అడుగు పెట్టబోతున్నారు.ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే వీరంతా డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన వారే.అయితే వీరిలో భారత సంతతి మహిళలు కూడా ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube