ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతడో గొప్ప వ్యక్తి.. కాని ఇకపై అతడు ప్రపంచంలోనే అత్యంత నీచుడు  

American Millionaire Put Plane On Autopilot Mode To Have Romance-millionaire Businessman Pleads Guilty,steven Bradley Mell,telugu Viral News,viral In Social Media,స్టీఫెన్‌ బ్రాడ్లీ మెల్‌

ఎంత మంచి వారికి అయినా కూడా కొన్ని సమయాల్లో నీచమైన బుద్దులు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో వాటిని అదుపులో పెట్టుకోకుంటే అన్ని సంవత్సరాలు వారు దక్కించుకున్న మంచితనం, మంచి పేరు నిమిషాల్లో నాశనం అవుతుంది. తాజాగా అమెరికాకు చెందిన ఒక 53 ఏళ్ల వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ వ్యక్తిగా గొప్ప వ్యక్తిగా పేరు దక్కించుకున్నాడు. ఎందుకంటే అతడు తన వద్ద ఉన్న కోట్టాది డాలర్లను ఎక్కువగా సేవా కార్యక్రమాలకు వినియోగించాడు..

ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతడో గొప్ప వ్యక్తి.. కాని ఇకపై అతడు ప్రపంచంలోనే అత్యంత నీచుడు-American Millionaire Put Plane On Autopilot Mode To Have Romance

పేదల వైధ్య సాయం కోసం ఎయిర్‌ ఆంబులెన్స్‌లను కూడా అతడు ఏర్పాటు చేశాడు. ఎయిర్‌ లైఫ్‌ లైన్‌ అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి అమెరికా మొత్తంలో చాలా ఫేమస్‌ అయ్యాడు. అతడి పేరే స్టీఫెన్‌ బ్రాడ్లీ మెల్‌ .

ఇప్పుడు ఇతడు అత్యంత నీచమైన వ్యక్తిగా ముద్ర పడ్డాడు.

స్టీఫెన్‌కు ఎయిర్‌ లైఫ్‌ లైన్‌ అనే స్వచ్చంద సంస్థ ఉండటంతో పాటు ప్లైట్‌ ఫ్లయ్యింగ్‌ పాటాలు కూడా నేర్పుతూ ఉంటాడు. 2017వ సంవత్సరం జులై 20వ తారీకున స్టీఫెన్‌ ఒక 15 ఏళ్ల బాలికకు విమానం నడపడం నేర్పేందుకు ఆకాశంలోకి వెళ్లాడు. ఆమెను తీసుకుని మినీ విమానంలో ఆకాశంలోకి వెళ్లిన స్టీఫెన్‌కు అక్కడ ఒక చిత్రమైన ఆలోచన కలిగింది. అదేంటి అంటే ఆ బాలికను అనుభవించాలని.

ఏమాత్రం మరో ఆలోచన లేకుండా విమానంను ఆటో పైలెట్‌ మోడ్‌(పైలెట్‌ లేకున్నా ఎక్కడికైతే వెళ్లాల్లో అక్కడకి విమానం వెళ్లేలా సెట్టింగ్‌ చేయడం) సెట్‌ చేసి అమ్మాయిపై అఘాయిత్యం చేశాడు.

ఆ బాలిక తన తల్లితో విషయం చెప్పడం జరిగింది. స్టీఫెన్‌ను ఈ విషయమై అడిగితే ఆయన పొంతన లేని సమాధానాలు చెబుతూ పట్టించుకోలేదు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

దాదాపు రెండు సంవత్సరాల పాటు కోర్టులో విచారణలు జరిగాయి. ఎట్టకేలకు మైనర్‌ బాలికపై విమానంలో అఘాయిత్యంకు సంబంధించిన కేసు తుది విచారణ పూర్తి అయ్యింది.

స్టీఫెన్‌ చివరకు తన తప్పును ఒప్పుకోవడంతో పాటు, ఆ సమయంలో తప్పు జరిగిపోయిందని, ఆ బాలిక కూడా వారించలేదని చెప్పాడు. స్టీఫెన్‌ చేసింది తప్పే అయినా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చూసి మొదటి తప్పుగా పరిగణించి వదిలేయాలని ఆయన తరపు న్యాయవాది కోరడం జరిగింది.

స్టీఫెన్‌కు అయిదు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు.