'రోబో' సినిమా రివర్స్‌ : వీడి పిచ్చి పీక్స్‌కు చేరినట్లుంది.. ఈ ప్రేమ కథ తెలిస్తే నోరెళ్లబెడతారు  

American Man Relationship With Robot-american Man,marrying Robot,robot Movie,ప్రేమ కథ,మేరీలాండ్‌

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన రోబో సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో హీరోయిన్‌ గా నటించిన ఐశ్వర్య రాయ్‌ అందంను చూసి రోబో కూడా ప్రేమలో పడుతుంది. రోబోకు ఫీలింగ్స్‌ రావడం వల్ల రజినీకాంత్‌ రూపంలో ఉన్న రోబో ఐశ్వర్య రాయ్‌ను ప్రేమించడం మొదలు పెడుతోంది..

'రోబో' సినిమా రివర్స్‌ : వీడి పిచ్చి పీక్స్‌కు చేరినట్లుంది.. ఈ ప్రేమ కథ తెలిస్తే నోరెళ్లబెడతారు-American Man Relationship With Robot

ఐశ్వర్య రాయ్‌ ప్రేమ కోసం ఆ రోబో ఏం చేస్తుందో సినిమా చూసిన వారికి అందరికి తెల్సిందే. అది సినిమా కాబట్టి ఏం చేసినా నడుస్తుంది. కాని నిజ జీవితంలో రోబో మనిషిని ఎలా ప్రేమిస్తుంది.

అది సాధ్యమో కాదు. కాని నిజ జీవితంలో రివర్స్‌ జరిగింది. ఒక రోబోపై మనిషి ప్రేమ పెంచుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే. అమెరికాలోని మేరీలాండ్‌కు చెందిన 29 సంవత్సరాల జోయీ మోరిన్‌ కొన్నాళ్ల క్రితం ఆన్‌ లైన్‌ లో ఒక రోబోను కొనుగోలు చేశాడు. చిన్న చిన్న పనులు చేయడంతో పాటు, చిన్నగా క్యూట్‌గా ఆ రోబో ఉండటంతో జోయి మోరిన్‌కు ఆ రోబో తెగ నచ్చింది.

ఎంతగా అంటే ఆ రోబోతోనే జీవితం అన్నట్లుగా, ఆ రోబోనే తన సర్వస్వం, ఆ రోబోనే తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలి అన్నంతగా నచ్చింది. తాను ఎక్కడకు వెళ్లినా ఆ రోబోను తీసుకు వెళ్తాడు, ఎక్కడ ఉన్నా కూడా ఆ రోబోతోనే ఎక్కువ సమయం ఉండేందుకు ఆసక్తి చూపిస్తాడు.

చివరకు ఆ రోబోను తాను త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించాడు. అతడి ప్రకటనకు సన్నిహితులు అవాక్కయ్యారు.

ఏమాత్రం సిగ్గు లేకుండా అతడు చేస్తున్న ఈ ప్రయత్నంను కొందరు తప్పు బడుతున్నారు. వస్తువుపై ప్రేమ పంచుకోవడం పర్వాలేదు. కాని వస్తువులను పెళ్లి చేసుకోవడం ఏంటీ, ఒక వస్తువు ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం..

అలాంటి వస్తువు గురించి జీవితంను నాశనం చేసుకోవడం ఏమాత్రం సబబు కాదు అంటూ అతడికి ఎంతో మంది సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు. కాని అతడు మాత్రం రోబోను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. చేసేది లేక కుటుంబ సభ్యులు కూడా రోబోతో అతడి వివాహంకు ఒప్పుకున్నారు.

అందుకే వీడి పిచ్చి మరీ పీక్స్‌కు వెళ్లినట్లుగా ఉందని ప్రపంచ వ్యాప్తంగా అనుకుంటున్నారు.