35 ఏళ్ల క్రితం నాటి హత్య కేసు: కాన్‌స్టిట్యూషన్ పార్టీ నేతపై అభియోగాలు

35 ఏళ్ల క్రితం జరిగిన బాలిక హత్య కేసులో తాను అభియోగాలు ఎదుర్కొంటున్నట్లు ఇదాహో రాష్ట్ర గవర్నర్‌గా పోటీపడిన స్టీవ్ పాంకీ సంచలన ప్రకటన చేశారు.గత వారం ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం అంగీకరించారు.1984లో జానెల్లి మాథ్యూస్ అనే 12 ఏళ్ల బాలిక కిడ్నాప్, హత్యకు గురైంది.ఈ కేసుకు సంబంధించి స్టీవ్ ఇంట్లో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

 American Leader Former Constitution Party Candidate For Idaho Governor Probed-TeluguStop.com

Telugu Candidat, Idahogovernor, Telugu Nri Ups-

  ఇందుకు సంబంధించిన వారెంట్‌ స్థానిక పత్రికల్లో ప్రచురితమైంది.68 ఏళ్ల పాంకీ 1984 ప్రాంతంలో కొలరాడోలని గ్రీలీలో నివసిస్తూ ఉండేవారు.ఆ ఏడాది డిసెంబర్ 20న మాథ్యూస్ క్రిస్మస్ వేడుకలో పాల్గొని తన స్నేహితులతో కలిసి తిరిగి ఇంటికి వస్తుండగా అపహరణకు గురైంది.ఆ ప్రదేశం పాంకీ నివాసానికి రెండు మైళ్ల దూరంలోనే ఉంది.

ఈ సంఘటన జరిగిన 35 ఏళ్ల తర్వాత.ఈ ఏడాది జూలై 23న గ్రీలీకి దగ్గరలోని రూరల్ ప్రాంతంలో పైప్‌లైన్ కోసం తవ్వకాలు జరుపుతుండగా మాథ్యూస్ అవశేషాలు బయటపడ్డాయి.

మరోవైపు తాను గ్రీలీ పోలీసులకు డీఎన్ఏ నమూనాలను ఇచ్చానని పాంకీ తెలిపాడు.అయితే ఈ వ్యాఖ్యలను పోలీసులు కొట్టిపారేశారు.

Telugu Candidat, Idahogovernor, Telugu Nri Ups-

  మాథ్యూస్ కేసులో ఇప్పటి వరకు పాంకీపై ఎటువంటి అభియోగాలు నమోదు కాలేదన్నారు.కానీ.ఈ కేసు విషయంగా పాంకీ పలుమార్లు డిటెక్టివ్‌లతో మాట్లాడేందుకు విశ్వప్రయత్నాలు సాగించినట్లుగా తెలుస్తోంది.మాథ్యూస్ గురించిన సమాచారం కోసం దర్యాప్తు అధికారులు పాంకీని పలుమార్లు ప్రశ్నించారు.అయితే తన లాయర్ లేకుండా నోరువిప్పేది లేదని స్పష్టం చేశాడు.కాగా స్టీవ్ పాంకీపై క్రిమినల్ కేసులు గతంలోనూ నమోదయ్యాయి.1977లో డేటింగ్ చేస్తున్న యువతిపై అత్యాచారంతో పాటు 20 కేసులు అతనిపై ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube