అమెరికా ప్రభుత్వానికి టోకరా వేసిన మహిళ..  

American Lady Alisan Daughter-

కూతురి పేరు చెప్పి కోట్లు కాజేసిన ఘటన అమెరికాలోని వాషింగ్టన్ లో చోటు చేసుకుంది.అలిసన్ అనే మహిళ తన కూతురు చనిపోయి ఎన్నో ఏళ్లు గడిచినా ఆ విషయాన్ని కప్పిపుచ్చి ప్రభుత్వం నుంచి కోట్లు రాబట్టి విలాసాలకు ఖర్చు పెట్టింది ఈ నయా తల్లి.దాదాపు 15 ఏళ్ల వరకు కూతురి పేరు చెప్పి ప్రభుత్వం నుంచి తాను పొందిన సొమ్ము మొత్తం రెండు లక్షల డాలర్లకు చేరింది..

American Lady Alisan Daughter--American Lady Alisan Daughter-

తన కూతురు తీవ్రమైన పరమైన అనారోగ్యంతో బాధ పడుతోందని ఆమెను దగ్గరుండి చూసుకోవడానికి ఎవరూ లేరని పేర్కొన్న తల్లి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కూతురి వైద్య సాయానికి ఆర్థిక అవసరాలు చాలా ఉన్నాయని అందుకు ప్రభుత్వం సాయం చేయాలని అభ్యర్థించింది.

దాంతో స్థానిక ప్రభుత్వ అధికారులు ఆమెకు కొంత ఆర్థిక సాయం చేశారు.

ఇలా 15 ఏళ్ల వరకు ఆమె ప్రభుత్వం నుంచి సొమ్ము తీసుకుంటూనే ఉంది.అయితే అప్పటికే చాలా సార్లు ఆమె కూతురు పరిస్థితి గురించి ఆరా తీసిన అధికారులకు ఆమె పొంతన లేని సమాధానాలు ఇస్తూ ఉండేది దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఆఫీస్ కు వచ్చిన ఆమెని నిలదీశారు.అక్కడితో ఆగకుండా పూర్తి దర్యాప్తు చేయాలని నుంచి ఆమె ఇంటికి వెళ్లి చూడగా ఆమె ఒక బొమ్మను చూపించి ఇదే తన కూతురు అంటూ చెప్పడంతో షాక్ అయిన అధికారులు ఆమె పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.