దేశంలో రైతుల సమ్మె, ఆర్టీసీ సమ్మె, ఉద్యోగుల సమ్మె చూస్తూ ఉంటాం.అప్పుడప్పుడు కార్మికులు కూడా సమ్మె చేస్తూ తమ నిరసనలు తెలియజేస్తూ ఉంటారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఉద్యమాలు చాలా చోట్ల జరిగాయి.అయితే అమెరికాలో తాజాగా మహిళల నుంచి సెక్స్ స్ట్రైక్ మొదలైంది.
సెక్స్ స్ట్రైక్ అంటే పురుషులతో సెక్స్ చేయడానికి మహిళలు ఒక్కసారిగా వ్యతిరేకంగా మారిపొయారు.దీనికి ప్రధాన కారణం ఉంది.
అమెరికాలో ఎక్కువగా డేటింగ్ కల్చర్ పెరిగిపోయి పెళ్లికి ముందే శారీరకంగా కలవడం, గర్భం వచ్చిన అబార్షన్ లు చేసుకోవడం వలన అక్కడ పుల్లల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది.
ఈ నేపధ్యంలో అమెరికాలో కొన్ని రాష్ట్రాలు అబార్షన్ మీద నిషేధం విధించాయి.
ఇక ఈ నిషేధం దేశ వ్యాప్తంగా విస్తరించాలనే ఆలోచనతో ఉంది.అయితే దీనికి మహిళల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది.
మీటూ యాక్టివిస్ట్ నటి అలిసా మిలనో ఒక ట్వీట్ తో ఉద్యమం మొదలు పెట్టారు.జార్జీయా ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ అబార్షన్ ల పై నిషేధాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ చట్టం మహిళల హక్కులను ఉల్లంఘించడమేనని ఆమె నిరసన తెలియజేసార.తమ శరీరాలపై హక్కులు లేకుండా చేయడం ఏంటని ప్రశ్నించారు.
ఈమె ఉద్యమానికి మద్దతుగా చాలా మంది మహిళలు వచ్చి సపోర్ట్ చేశారు.వీరంతా కలిసి తాజాగా అబార్షన్లపై నిషేధాన్ని ఎత్తివేసే వరకూ సెక్స్ స్ట్రైక్ చేయాలని నిర్ణయించారు.
మొత్తానికి ఇప్పుడు ఈ సెక్స్ స్ట్రైక్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.