అమెరికాలో స్వాతంత్రోద్యమ పార్టీలో కాల్పుల కలకలం..!!!

అమెరికాలో మరో సారి కాల్పుల కలకలం సంచలన సృష్టించింది.గత కొంత కాలంగా అమెరికాలోని వివిధ ప్రాంతాలలో వరుసగా కాల్పుల మోత మోగుతూనే ఉంది.

 Gun Fire On South Carolina Nightclub, America, South Carolina Night Club, Gun Fi-TeluguStop.com

కొందరు జాత్యహంకారంతో హత్యలు చేస్తే మరి కొందరు డబ్బు దోచుకునే పనిలో, దొంగతనాలు చేసే క్రమంలో తుపాకీ తో బెదిరించి దోచుకుంటారు.ఇలాంటి ఎన్నో సంఘటనలు అమెరికాలో ప్రతీ రోజు ఏదో ఓ మూల కనిపిస్తూనే ఉంటాయి.

అయితే అమెరికాలో తుపాకీ వాడటం పెద్ద విషయమేమీ కాదు సంతలో కూరలు అమ్మినట్టుగా అమెరికాలో తుపాకులు అమ్ముతారు.ఈ క్రమంలోనే దొంగలకి లూటీలు చేయడం పెద్ద కష్టంగా అన్పించడం లేదు.

రెండు రోజుల క్రితమే అమెరికాలో ఓ నైట్ క్లబ్ లో జరిగిన గన్ ఫైర్ లో ఇద్దరు ప్రాణాలు కోల్పయిన సంఘటనలు మరువక ముందే తాజాగా అమెరికా స్వతంత్వ ఉద్యమ వేడుకలను జరుపుకుంటున్న క్రమంలో ఒక్క సారిగా కాల్పులు జరిగాయి.ఈ సంఘటన సంచలనం సృష్టించింది.

స్వాతంత్ర వేడుకలలో కాల్పులు జరగడంలో ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

Telugu America, Gun, Carolina Club-Telugu Visual Story Telling

అమెరికాలోని సౌత్ కరోలినాలని గ్రీన్ విల్లేలో ఉన్న నైట్ క్లబ్ లో కాల్పులు జరిగాయి.కాల్పులకి ముందుగా ఆ క్లబ్ లో సుమారు 200 మంది కలిసి పార్టీ చేసుకుంటున్నారు.రాత్రి సుమారు 2 గంటల సమయంలో కొందరు వచ్చి ఒక్క సారిగా అక్కడ ఉన్న వారిపై కాల్పులకి తెగబడ్డారు.కాల్పుల మోత విన్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకోగా దుండగులు తప్పించుకున్నారు.

ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా పది మందికి పైగా అమెరికన్స్ తీవ్ర గాయాల పాలైనట్టుగా తెలుస్తోంది.ఈ ప్రాంతానికి కొంత దూరంలోనే రెండు రోజుల క్రితం కాల్పులు జరిగాయని స్థానికులు చెప్తున్నారు.

ఇదిలాఉంటే తుపాకీ సంస్కృతీ అమెరికాలో పోయే వరకూ ఇలాంటి దారుణాలు అమెరికన్స్ ఎదుర్కోవాల్సిందే చావాల్సిందే అంటూ సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube