అమెరికాలో “భారతీయ అమెరికన్ల” హవా..       2018-05-18   00:53:30  IST  Bhanu C

ఎన్నో ఏళ్ల క్రితం ఉద్యోగాలు,చదువులు,వ్యాపార విస్తరణ వంటి వాటి కోసం ఎంతో మంది భారతీయులు విదేశాలకి వెళ్ళారు..అక్కడ ఉన్నతమైన ఉద్యోగాలు, ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తూ భారతీయుల అభివృద్దికి సైతం తోడ్పడ్డారు..అంతేకాదు ఆర్థికంగా ఎంతో బలమైన శక్తులుగా అమెరికాలో ప్రాధాన్యత కల్పించుకున్నారు..ఎంతో మంది అమెరికా వెళ్లి స్థిరపడాలి అనుకున్న వారికోసం తమ వంతు సాయం కూడా చేసారు..అలా వెళ్ళిన ఎంతో మందికి అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డు లు మంజూరు చేసి తమ పౌరులుగా గుర్తింపు కూడా ఇచ్చింది..అంతేకాదు.

అమెరికాలో పౌరులు ఎలా అయితే స్వేచ్చగా తమ దేశ అధికారాని వినియోగించుకుంటారో అలాగే భారతీయులకి సైతం కలిపించింది..అలా అక్కడి నుంచీ మొదలయిన భారతీయుల ప్రస్థానం ఇప్పుడు ఏకంగా అమెరికా లో జరిగే ఎన్నికల్లో అభ్యర్దులగా నిలబడేలా చేసింది…భారతీయ సంతతి వ్యక్తులు ఇప్పుడు చట్టసభల నుంచీ మేయర్స్ వరకూ అన్ని రంగాలలో భారతీయ సత్తా చాటుతూ వచ్చారు..తాజాగా

అమెరికా ప్రతినిధుల సభతోపాటు సెనేట్‌లోని 35 స్థానాలకు నవంబరులో జరుగబోతున్న ఎన్నికల్లో దాదాపుగా 80 మందికిపైగా భారతీయ అమెరికన్లు పోటీ పోటీ చేయబోతున్నారు.. వీరిలో ఎక్కువ మంది డెమోక్రటిక్‌ పార్టీ తరపునే బరిలోకి దిగుతున్నారు.అంతేకాదు… ప్రతినిధుల సభ, సెనేట్‌తోపాటు 39 రాష్ట్రాల్లోని భిన్న పదవులకూ ఈ సారి ఎన్నికలు జరుగుతున్నాయి
అయితే వీటిపై వైట్ హౌస్ మాజీ అధికారి భారతీయ “అమెరికన్‌ ఇంపాక్ట్‌ ఫండ్‌” వ్యవస్థాపకులు గౌతమ్‌ రాఘవన్‌ మాట్లాడారు. ఈ సారి పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు బరిలోకి దిగుతున్నట్లు వివరించారు…ఈ సారి అమీ బెరా, రో ఖన్నాలతో పాటు రాజా కృష్ణమూర్తి, పరిమళ జయపాల్‌ అందరూ ఈ ఎన్నికల్లో పాల్గొంది మరోసారి పదవులకోసం ఎదురుచూస్తున్నారని అన్నారు..