అంధకారంలో కాలిఫోర్నియా: కార్మికులపై దాడులు వద్దన్న గవర్నర్

కాలిఫోర్నియాలో కార్చిచ్చు నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుండటంతో ఎన్నో ప్రాంతాలు అంధకారంలో మగ్గుతున్నాయి.ఈ క్రమంలో ప్రజలు పసిఫిక్ అండ్ ఎలక్ట్రిక్ (పీజీ అండ్ ఈ)కి సంబంధించిన ఉద్యోగులకు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు.

 American Governor Gavin Newsom Pleadswithresidents To Stoptargeting Pacificgas-TeluguStop.com

అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు భౌతికదాడులకు సైతం పాల్పడుతున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.

పీజీ అండ్ ఈ కార్మికులపై బెదిరింపులు, వేధింపులకు పాల్పడవద్దని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.తమపై కొందరు పౌరులు వస్తువులను విసిరేయడంతో పాటు కార్యాలయాలు, కంపెనీ వాహనాలకు నష్టం కలిగించారని పీజీ అండ్ ఈ కార్మికులు తెలిపారు.

దీనిపై ఎల్ డొరాడో కౌంటీలో గవర్నర్ మాట్లాడుతూ.కార్మికులు మీతో పాటు ఈ సంఘంలో సభ్యులని… మీ పిల్లలను పంపిన అదే పాఠశాలలకు వారు కూడా తమ పిల్లలను పంపుతున్నారని పేర్కొన్నారు.

సమస్యను పరిష్కరించేందుకు పీజీ అండ్ ఈ కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారని న్యూసోమ్ తెలిపారు.

Telugu Newsom Pleads, Telugu Nri Ups, Pacific Gas-

ఈ నెల ప్రారంభంలో ఉత్తర కాలిఫోర్నియాలో బలమైన ఈదురుగాలులు, కార్చిచ్చు కారణంగా పీజీ అండ్ ఈ కంపెనీ ముందుజాగ్రత్తగా వేలాది నివాస సముదాయాలు, వ్యాపార కార్యాలయాలకు విద్యుత్‌ను నిలిపివేసింది.రోజుల తరబది అంధకారంలో ఉండటం.సమస్య రాను రాను తీవ్రతరం అవుతుండటంతో జనంలో ఓపిక నశించింది.

ఈ క్రమంలో పీజీ అండ్ ఈ కంపెనీకి సంబంధించిన కార్యాలయాలపై గత వారం కోడి గుడ్లతో దాడి చేశారు.అలాగే కొలూసా కౌంటీలో యుటిలిటీ ట్రక్కుకు నిప్పంటించారు.

Telugu Newsom Pleads, Telugu Nri Ups, Pacific Gas-

ఇదే సమయంలో పీజీ అండ్ ఈ కంపెనీ వ్యవహారశైలిపై గవర్నర్ మండిపడ్డారు.యంత్ర పరికరాలను నిర్వహించడంలో ఆ కంపెనీ విఫలమవుతుందని.తద్వారా గత కొన్నేళ్లలో చెలరేగిన కార్చిచ్చుకు పీజీ అండ్ ఈ కారణమైందని న్యూసోమ్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల ఆగ్రహం సరైనదేనన్న ఆయన… కానీ విధులు నిర్వర్తించే సాధారణ కార్మికులను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube